ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తిని కాపాడిన పోలీసులు

ABN, First Publish Date - 2023-04-25T23:54:13+05:30

ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం రాణిపేట గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నం

పోలీసులకు సమాచారం ఇచ్చిన రైతులు

మిడ్జిల్‌, ఏప్రిల్‌ 25: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం రాణిపేట గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన అనకాపల్లి సత్యం పట్టణంలో ఓంకార్‌ మెడికాల్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితం ఇంటినుంచి బయటకు వచ్చాడు. ఈ విషయమై సత్యం కుటుంబ సభ్యులు కల్వకుర్తి పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేయించారు. మంగళవారం రాణిపేట గ్రామ శివారులోని చెరువులో వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తుండగా, చుట్టు పక్కల ఉన్న రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్‌ సిబ్బంది మల్లేష్‌, నారాయణ్‌రెడ్డి, విష్ణువర్ధన్‌గౌడ్‌ వెంటనే చెరువు వద్దకు చేరుకొని సత్యంను చెరువులోంచి బయటకు తీయించారు. కల్వకుర్తి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం 108 అంబులెన్స్‌లో కల్వకుర్తికి తరలించారు. వ్యక్తిని కాపాడినందుకు స్థానికులు పోలీసులను అభినందించారు.

Updated Date - 2023-04-25T23:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising