ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శాఖాహార జంతువులు పెరగాలి

ABN, First Publish Date - 2023-08-08T23:11:44+05:30

శాఖాహార జంతువులు పెరిగితేనే పెద్ద పులుల వృద్ధి జరుగుతుందని రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్‌(కంపా) లోకేష్‌ జైస్వాల్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్య ప్రాంతంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు.

ఫరహాబాద్‌ సౌత్‌ బీట్‌లో గడ్డి క్షేత్రాలను పరిశీలిస్తున్న లోకేష్‌ జైస్వాల్‌

అప్పుడే పెద్ద పులుల వృద్ధి : పీసీసీఎఫ్‌(కంపా) లోకేష్‌ జైస్వాల్‌

అమ్రాబాద్‌ అడవుల్లో వన్యప్రాణి సంరక్షణ చర్యల పరిశీలన

మన్ననూర్‌, ఆగస్టు 8 : శాఖాహార జంతువులు పెరిగితేనే పెద్ద పులుల వృద్ధి జరుగుతుందని రాష్ట్ర అటవీశాఖ పీసీసీఎఫ్‌(కంపా) లోకేష్‌ జైస్వాల్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్య ప్రాంతంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. దోమలపెంట, మన్ననూరు రేంజ్‌ల్లో అటవీశాఖ చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఫరహాబాద్‌ సౌత్‌ బీట్‌ గడ్డి క్షేత్రాలు, సౌరశక్తి బోరు మోటారు పంపింగ్‌ సిస్టమ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ చేపట్టిన భవిష్యత్‌ ప్రణాళికను చాట్‌ బోర్డుపై బీట్‌ అధికారి హన్మంత్‌నాయక్‌ పీసీసీఎఫ్‌కు వివరించారు. అనంతరం లోకేష్‌ జైస్వాల్‌ మన్ననూరులో బీట్‌ అధికారి క్వార్టర్‌ను ప్రారంభించారు. మన్న నూరు చెక్‌పోస్టు వద్ద గల సీబీఈటీ కాటేజీలను తనిఖీ చేశారు. అమ్రాబాద్‌ అభయారణ్యంలో వన్యప్రాణి సంరక్షణ చర్యలు సంతృప్తిగా ఉన్నాయని సిబ్బందిని ప్రశంసించారు. ముఖ్యంగా క్షీణ దశలో ఉన్న అడవులకు జీవం పోసేలా కొత్త మొక్కలను పెంచాలని కోరారు. పెద్ద పులులకు అవసర మైనన్ని శాకాహార జంతువులను పెంచాలని, అందుకు వైల్డ్‌ లైఫ్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. రేంజ్‌, సెక్షన్‌, బీట్‌, టైగర్‌ ప్రొటెక్షన్‌ వాచర్లు సమన్వయంతో పని చేస్తూ అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అమ్రాబాద్‌ పులుల అభయారణ్య ప్రాంతం(ఏటీఆర్‌) క్షేత్ర సంచాలకులు క్షితిజ, అమ్రాబాద్‌ ఎఫ్‌డీవో బత్తుల విశాల్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌డీవో శ్రీనివాస్‌, అటవీ రేంజ్‌ అధికారులు ప్రభాకర్‌, ఆదిత్య, సెక్షన్‌ అధికారి పర్వతాలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-08T23:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising