ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అలంకారప్రాయంగా మఠంపల్లి సబ్‌మార్కెట్‌

ABN, Publish Date - Dec 16 , 2023 | 11:57 PM

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో చివరలో ఉండే మఠంపల్లి మండలంలో వ్యవసాయ సబ్‌మార్కెట్‌ అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది.

మఠంపల్లిలోని సాగర్‌ సిమెంట్‌ సమీపంలో ఖాళీగా కంపచెట్ల మధ్య సబ్‌మార్కెట్‌ గోదాంలు

మఠంపల్లి, డిసెంబరు 16 : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో చివరలో ఉండే మఠంపల్లి మండలంలో వ్యవసాయ సబ్‌మార్కెట్‌ అలంకారప్రాయంగా దర్శనమిస్తోంది. ప్రతి ఏటా గోదాం మరమ్మతులు, నూతన భవనాలు తదితర అవసరమైన మా ర్కెట్‌ కోసం మార్కెటింగ్‌ శాఖ భారీస్థాయిలో నిధు లు విడుదల చేస్తున్నా ఆశించిన లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. హుజూర్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో మఠంపల్లి మండలంలో సబ్‌మార్కెట్‌ పనిచేస్తుంది. ఈ మార్కెట్‌ నిర్మాణం నాటి నుంచి నేటి వరకు రైతులకు ఏనాడూ ఉపయోగ పడలేదు. దశాబ్దాల తరబడి ఇదే తంతు కొనసాగతున్నా మార్కెటిం గ్‌ శాఖ సర్దుబాటు చర్యలపై మాత్రం దృష్టి పెటడంలేదు. ఫలితంగా అన్నదాతలు ధాన్యం విక్రయించడానికి నానాతంటాలు పడుతున్నారు. మిల్లుకు తీసుకెళ్లి న ధాన్యాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోలేరు. వారు ఎంతధర నిర్ణయిస్తే ఆ మేరకు విక్రయిస్తున్నారు. ప్రతీ ఏటా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచుతూ వస్తోంది. వానాకాలం సీజన్‌ ప్రారంభంలో రెండు, మూడు రోజులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేయడం ఆ తర్వాత సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారు. ప్రతి ఏడాది ఇదే తంతూ పీఏసీఎ్‌సలు, ఐకేపీ, కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేసినా అక్కడా సన్నరకాలు కొనే అవకాశం లేదు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

పెరిగిన పచ్చి ధాన్యం విక్రయాలు

పచ్చిధాన్యం విక్రయాలు ఆయకట్టులో భారీగా పెరిగాయి. కాస్త మబ్బుపట్టి వాతవరణం ప్రతికూలంగా ఉందంటే మిల్లర్లు అమాంతం ధాన్యానికి ధరను తగిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే వ్యాపారులు రూ.200 నుంచి 300 వరకు తగ్గించారు. మండలంలో ఎక్కువశాతం సన్నకారు రైతులే సా గుచేస్తున్నారు.ఈధాన్యానికి రూ.1800 నుంచి రూ.2 వేల పైచినుకు వరకు ధరలు పలికే పరిస్థితి ఉన్నా మిల్లర్లు, దళారులు రైతులను దగా చేస్తుండటంతో సరైన ఫలితం లభించక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతులకు ప్రతి ఏటా ఖర్చుల భా రం పెరుగుతుంది. ఎరువులు, కూలీల ఖర్చు మొదలుకొని వరికోతలకు ఖర్చులు అన్నీ ప్రతి పెరుగుతున్నాయి. కానీ రైతులకు రెండు మూడేళ్ల కిందట ఏధరలు లభిస్తున్నాయో ఇప్పుడు అవే ధరలు వస్తుండటం గమనార్హం.

తక్కువ ధరకే విక్రయిస్తున్నారు

ఆరుగాలం కష్టంచి పండించిన పంటను మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.దళారులు త క్కువ ధరలకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మం డలంలో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలు లేక తప్పనిస రి పరిస్థితిలో దళారులకు విక్రయించాల్సిన పరిస్ధి తి. తేమ పేరుతోనూ మోసం చేస్తున్నారు. ప్రభుత్వం పత్తి రైతులను అన్నివిధాలా ఆదుకునే ఏర్పాట్లుచేయాలి.

-మాలోతు బాలునాయక్‌, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు

సమస్యలను మంత్రి ఉత్తమ్‌ దృష్టికి తీసుకెళ్తా

గత పాలక ప్రభుత్వాలు రైతుల సమస్యను పట్టించుకోలేదు. మండలంలో వరి, పత్తి కొనుగోలు కేంద్రా లు లేక రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారు. రైతుల సమస్యలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వరి, పత్తి కొనుగోలు కేంద్రా లు ఏర్పాటుకు కృషి చేస్తా. అందుకు అవసరమైన నిధు లు మంజూరు చేయించి మార్కెట్‌ యార్డును ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తా.

- ఆదూరి స్రవంతికిషోర్‌రెడ్డి, మాజీ సర్పంచ మఠంపల్లి

Updated Date - Dec 16 , 2023 | 11:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising