ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధార్‌ నవీకరణ తప్పనిసరి: మెదక్‌ కలెక్టర్‌

ABN, First Publish Date - 2023-03-20T23:40:00+05:30

పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్‌ కార్డులను నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజర్షిషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మెదక్‌ అర్బన్‌, మార్చి 20: పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్‌ కార్డులను నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌర సేవలను పొందాలనుకునేవారు ఆధార్‌ ఆప్‌డేట్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. దీంతో ఆధార్‌ లింక్‌తో కొనసాగుతున్న సేవలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా 2014 కంటే ముందు ఆధార్‌ పొందిన వారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్‌డేట్‌ చేసుకోని వారు వెంటనే నవీకరణ చేసుకోవాలని సూచించారు. నవీకరణలో అవసరమైన సాయం, సలహాల కోసం 1947 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్‌ చేయవచ్చని, లేదా మైఆధార్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నవీకరణ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆధార్‌ ప్రగతిని మానిటరింగ్‌ చేసేందుకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై ఎన్‌రోల్‌మెంట్‌, నమోదు కేంద్రాల ఏర్పాటు, బయోమెట్రిక్‌ ఆప్‌డేట్‌ వంటి కార్యకలాపాలను సమీక్షిస్తూ, ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, డీఈవో రాధాకిషన్‌, లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ వేణుగోపాల్‌, మీసేవ జిల్లా మేనేజర్‌ శశికాంత్‌, ఈడీఎం సందీప్‌, ఇంటర్‌ నోడల్‌ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-20T23:40:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising