ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణంలో నాణ్యత లోపిస్తే చర్యలు

ABN, First Publish Date - 2023-01-19T00:10:08+05:30

‘నత్తనడకన మార్కెట్‌ నిర్మాణం’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ స్పందించారు.

సంగారెడ్డిలో నిర్మాణ దశలో ఉన్న సమీకృత మార్కెట్‌ సముదాయ పనులను పరిశీలిస్తున్నకలెక్టర్‌ శరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన సంగారెడ్డి కలెక్టర్‌

వేగంగా పూర్తిచేయాలని ఆదేశం

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

సంగారెడ్డిటౌన్‌, జనవరి18: ‘నత్తనడకన మార్కెట్‌ నిర్మాణం’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ స్పందించారు. బుధవారం కలెక్టర్‌ శరత్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షిషాతో కలిసి మార్కెట్‌ సముదాయ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. మార్కెట్‌ సముదాయ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. మార్కెట్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పనులు పూర్త యి మార్కెట్‌ వినియోగంలోకి వస్తే అన్ని విక్రయాలు ఒకేచోట జరగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. రాత్రింబవళ్లు పనులపై దృష్టి సారించాలని కాం ట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు వేగవంతం చేసి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ డీఈ ఇంతియాజ్‌ అహ్మద్‌, పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - 2023-01-19T00:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising