అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయం
ABN, First Publish Date - 2023-10-08T00:33:17+05:30
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా బీఆర్‌ఎస్ మెనిఫెస్టో : మంత్రి హరీశ్‌రావు
ఝరాసంగం, అక్టోబరు 7: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని బిడెకన్నె గ్రామంలో అసైన్ట్‌మెంట్‌దారులకు పట్టాదారు పాసుపుస్తకాలను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు దిమ్మతిరిగేలా త్వరలో కేసీఆర్ మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేశారు. బిడెకన్నే గ్రామంలో 154 మంది రైతులకు 351 ఎకరాల్లో 52 బోర్లు వేసిస్తామని, రూ, 1.26 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక్కడి మహిళలు సంఘటితంగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ దేశవిదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం మండల కేంద్రమైన ఝరాసంగంలో ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రి ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, జహీరాబాద్ ఎమెల్యే మాణిక్ రావు, రాష్ట్ర బేవరేజెస్ మాజీ కార్పొరేషన్ చెర్మన్ దేవీప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ డెవల్‌పమెంట్ చైర్మెన్ నరోత్తం, టీఎ్‌సఐడీసీ చైర్మన్ తన్వీర్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్యస్వామి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఉన్నత విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం
కోహీర్ : రాష్ట్రంలోని నిరుపేదల పిల్లలకు ఉన్నత విద్యను అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. కోహీర్ మండల పరిధిలోని కవేలీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్ కోసం కోట్ల రూపాయలు ఖర్చుస్తున్నదన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు విద్యతో పాటు జీవనోపాధి కోసం వృత్తివిద్య తరగతులను కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్టం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జిల్లా కలెక్టర్ శరత్, డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-10-08T00:33:17+05:30 IST