బీఆర్‌ఎస్ పథకాలు దేశానికే ఆదర్శం
ABN, First Publish Date - 2023-04-30T00:42:51+05:30
బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.
న్యాల్‌కల్, ఏప్రిల్ 29 : బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రాఘవపూర్-హుమ్నాపూర్ శివారులో మంజీర నది తీరాన ఉన్న పంచవటి క్షేత్రంలో కొనసాగుతున్న గరుడగంగ మంజీర కుంభమేళాలో శనివారం ఆయన పాల్గొన్నారు. పీఠాధిపతి కాశీనాథ్‌బాబాతో కలిసి మంజీర నదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాకిజనవాడలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ తరహా పథకాలు కావాలని, బీఆర్‌ఎస్ పాలన రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. డబుల్‌ఇంజన్ సర్కారుతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. కాకిజనవాడ గ్రామం అభివృద్ధికి నిధులను కేటాయిస్తామమని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీటీసీ స్వప్నభాస్కర్, ఎంపీపీ అంజమ్మ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, నాయకులు రాజ్‌కుమార్, వీరారెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, ప్రవీణ్, రాజుపాటిల్, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-30T00:42:51+05:30 IST