దళితులను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ABN, First Publish Date - 2023-03-31T00:19:23+05:30
హుస్నాబాద్, మార్చి 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వర్గాలను విస్మరిస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు తాళ్లపెల్లి లక్ష్మణ్ అన్నారు.
హుస్నాబాద్, మార్చి 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత వర్గాలను విస్మరిస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు తాళ్లపెల్లి లక్ష్మణ్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవనంలో దళిత హక్కుల పోరాట సయమితి జిల్లా రెండో మహాసభలో ఆయన మాట్లాడారు. దళితులు ఇప్పటికీ తీవ్రమైన కులవ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నారని, సామాజికంగా, న్యాయపరంగా వారిని రక్షించడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమౌతున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా అణచివేస్తున్నారని విమర్శించారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహాసభ 1న హైదరాబాద్‌లో జరుగుతుందని, ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నిర్మాణ బాధ్యులు గడిపె మల్లేశ్, జిల్లా కార్యదర్శి వేల్పుల బాలమల్లు, నాయకులు సత్యనారాయణ, కనుకుంట్ల శంకర్, కొమ్ముల భాస్కర్, కొయ్యడ కొంరయ్య, జేరిపోతుల జనార్ధన్ పాల్గొన్నారు.
Updated Date - 2023-03-31T00:19:23+05:30 IST