బెస్ట్ టూరిజం విలేజ్‌గా చంద్లాపూర్
ABN, First Publish Date - 2023-09-26T00:30:18+05:30
జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో అవార్డులను అందుకుంటున్న సిద్దిపేట.. మరోసారి తన సత్తాచాటింది. జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ ఎంపికైంది.
గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు
చిన్నకోడూరు, సెప్టెంబరు 25: జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో అవార్డులను అందుకుంటున్న సిద్దిపేట.. మరోసారి తన సత్తాచాటింది. జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ ఎంపికైంది. 2023 బెస్ట్ టూరిజం విలేజ్ పోటీకి దేశవ్యాప్తంగా 795 దరఖాస్తులు రాగా చంద్లాపూర్ గ్రామానికి ఈ గుర్తింపు దక్కడం విశేషం. ఈ నెల 27న భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో గుర్తింపు టోకెన్‌ను అందజేయనున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవతో రంగనాయకస్వామి కొలువైన చంద్లాపూర్ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయర్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. రిజర్వాయర్ మధ్యలో రంగనాయక కొండలు అద్భుతమైన ద్వీపంగా కనువిందు చేస్తున్నది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా చంద్లాపూర్ గ్రామం ఎంపిక కావడం పట్ట చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతానికి నెలవుగా మారిందనడానికి ఇది గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్లాపూర్ గ్రామ ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపే నిదర్శనమని జడ్పీ చైర్‌పర్సన్ రోజారాధాకృష్ణశర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2023-09-26T00:30:25+05:30 IST