ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజగోపుర ఆవరణలో గోశాల ఏర్పాటుకు నిర్ణయం

ABN, First Publish Date - 2023-01-11T23:06:26+05:30

చేర్యాల, జనవరి 11: ఇతర ప్రముఖ ఆలయాల మాదిరిగా కొమురవెల్లి మల్లన్న ఆలయ రాజగోపుర ఆవరణలో గోకులం ఏర్పాటుకు ధర్మకర్తల మండలి నిర్ణయించింది.

సమీక్షా సమావేశంలో చర్చిస్తున్న ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నాల టికెట్ల ధరల పెంపునకు ఆమోదం

ధర్మకర్తల మండలి సమీక్షా సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు

చేర్యాల, జనవరి 11: ఇతర ప్రముఖ ఆలయాల మాదిరిగా కొమురవెల్లి మల్లన్న ఆలయ రాజగోపుర ఆవరణలో గోకులం ఏర్పాటుకు ధర్మకర్తల మండలి నిర్ణయించింది. గతంలో దాత సహాయంతో తోటబావి ప్రాంగణానికి వెళ్లేదారిలో ఏర్పాటుచేసిన గోకులం ఆలయవర్గాల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారిన విషయమై ఇటీవల ఆంధ్రజ్యోతిలో ‘గోమాత సేవలకు నోచుకోని మల్లన్న భక్తులు’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. బుధవారం మల్లన్న ఆలయంలో పాలకమండలి చైర్మన్‌ గీస భిక్షపతి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ మేరకు ఆలయాభివృద్ధి, ఇతరత్రా అంశాలపై చర్చించగా, రాజగోపుర ఆవరణలో నూతనంగా గోశాల ఏర్పాటుకు నిర్ణయించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ సందీ్‌పపై సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని, ఖాళీగా ఉన్న డోలు, శృతి పోస్టుల నియామకం, మల్లన్న మూలవిరాట్టుకు బంగారు రుద్రాక్షమాల, కోరమీసం, లింగం కాయ, అమ్మవార్లకు బంగారు కిరీటం తయారీ, దాసారంగుట్ట పక్కనగల సర్వే నెం.308/ఏలోని 22 ఎకరాల భూమిని భూసేకరణ ద్వారా ఖరీదు చేయుటకు, వాకీటాకీలు ఖరీదుతో పాటు పట్నాల టికెట్ల ధరల పెంపు, కోతుల బెడద నివారణకు జాలీల బిగింపు పనులకు తీర్మానం చేశారు. అనంతరం భిక్షపతి మాట్లాడుతూ ఆదాయం ఏయేటి కాయేడు రికార్డుస్థాయిలో పెరుగుతుందని, తదనుగుణంగా ఆలయాభివృద్ధికి, భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో ఈవో బాలాజీశర్మ, ధర్మకర్తలు రఘు, సిద్ధిరాములు, సిద్ధిలింగం, స్వప్న, బుచ్చి రెడ్డి, గిరిధర్‌, ప్రధానార్యకుడు మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-11T23:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising