అలంకారప్రాయంగా నిఘానేత్రాలు..!
ABN, First Publish Date - 2023-04-26T23:45:44+05:30
తొగుట, ఏప్రిల్ 26: అసాంఘీక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి గతంలో పోలీసులు ప్రజల సహకారంతో తొగుట మండలంలోని కాన్గల్, ఎల్లారెడ్డిపేట, ఘనపూర్, బండారుపల్లి, తుక్కాపూర్, తొగుట, రాంపూర్, వెంకట్రావ్‌పేట తదితర గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
పనిచేయని సీసీ కెమెరాలు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
తొగుట, ఏప్రిల్ 26: అసాంఘీక శక్తులకు అడ్డుకట్ట వేయడానికి గతంలో పోలీసులు ప్రజల సహకారంతో తొగుట మండలంలోని కాన్గల్, ఎల్లారెడ్డిపేట, ఘనపూర్, బండారుపల్లి, తుక్కాపూర్, తొగుట, రాంపూర్, వెంకట్రావ్‌పేట తదితర గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆయా గ్రామాల్లో అవి పనిచేయకుండా అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల ఉన్న శ్రద్ధ వాటి నిర్వహణ పట్ల చూపకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. మండల కేంద్రమైన తొగుటలో వ్యాపార, వర్తక, వాణిజ్య సముదాయాల దుకాణ యజమానులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పోలీసులు సమావేశం నిర్వహించి సుమారు రూ.1.50 లక్షల వరకు విరాళాలు సేకరించారు. వాటితో 10 సీసీ కెమెరాలను కొనుగోలు చేసి తొగుట-సిద్దిపేట రహదారిపై, గ్రామంలోని ప్రధాన వీధులపైన ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పోలీ్‌సస్టేషన్‌లో కంట్రోల్ రూం ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టేలా ఏర్పాటు చేశారు. తొగుటలో మార్కెట్‌యార్డు ముందు, పోలీ్‌సస్టేషన్, బ్యాంక్‌లు, ఏటీఎంలు, గ్రామపంచాయతీ, మార్కెట్‌యార్డు దుకాణ సముదాయాలు, పార్క్, పెట్రోల్ పంప్, ప్రభుత్వ పాఠశాల, వైన్స్‌షాపు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా ఇప్పుడు ప్రజాప్రతినిధుల, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అవి నిరూపయోగంగా మారాయి. దాంతో గ్రామాల్లో ఏదైనా సంఘటన చోటుచేసుకున్నా, ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినా, దొంగతనాలు, ప్రమాదాలు జరిగినా కనుగొనేందుకు పోలీసులకు ఇబ్బందిగా మారుతున్నది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి నిర్వహణ పట్ల శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2023-04-26T23:45:44+05:30 IST