ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారానికే ‘మీ కోసం’: పద్మారెడ్డి

ABN, First Publish Date - 2023-02-16T23:33:32+05:30

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.

ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ మున్సిపాలిటి/హవేళిఘణపూర్‌, ఫిబ్రవరి 16: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడానికే మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. మెదక్‌లోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఎమ్మెల్యే సంబంధిత తహసీల్దార్లతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. కాగా బాలానగర్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త కళావతి, హవేళిఘణపూర్‌ మండలం కూచన్‌పల్లికి చెందిన మన్నె మంగ, లత, శమ్నాపూర్‌ గ్రామానికి చెందిన సుధాకర్‌లు ఇటీవల మృతి చెందారు. వారికి పార్టీ నుంచి వచ్చిన రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు మెదక్‌ మండలంలో పాక్షికంగా కూలిపోయిన నివాసాల బాధితులు 34 మందికి ప్రభుత్వ సాయాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. వీరితో పాటు హవేళిఘనపూర్‌ మండలానికి చెందిన ఏడుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యారెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, హవేళిఘణపూర్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్‌లు దేవాగౌడ్‌, లింగం, నాయకులు సుభాష్‌ రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కాగా హవేళిఘణపూర్‌ మండలంలోని భూర్గుపల్లి గ్రామానికి చెందిన గడ్డం నరేష్‌ మంగళవారం విద్యుదాఘాతంతో మరణించాడు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గురువారం అతడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె వెంట జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచ్‌ చెన్నారెడ్డి, భాగ్యలక్ష్మి, ఎంపిటీసి అర్చన, డైరెక్టర్‌ సాప సాయిలు, శ్రీనివాస్‌, తదితరులున్నారు.

Updated Date - 2023-02-16T23:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising