ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మెదక్‌కు వైద్య కళాశాల మంజూరు

ABN, First Publish Date - 2023-07-06T00:05:18+05:30

మెదక్‌ జిల్లావాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరనున్నది. మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది.

మెదక్‌ పట్టణంలోని రాందాస్‌చౌరస్తాలో సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెరవేరనున్న జిల్లా వాసుల కల

పరిపాలన అనుమతుల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు : ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్‌అర్బన్‌, జూలై5: మెదక్‌ జిల్లావాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరనున్నది. మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈమేరకు వైద్యకళాశాల నిర్మాణానికి వైద్యఆరోగ్యశాఖ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది. సర్కారు ఉత్తర్వుల మేరకు త్వరలోనే మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగనున్నాయి.

ఎంసీహెచ్‌ పక్కన ఏర్పాటు

మెదక్‌ జిల్లా కేంద్రంలోని మాతా శిశుసంరక్షణ కేంద్రం 4 ఎకరాల్లో ఉన్నది. తాజాగా దీనికి అనుబంధంగా మంజూరైన మెడికల్‌ కళాశాల 15 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. వైద్యకళాశాల భవన సముదాయం, వసతిగృహాలు, ప్రత్యేక వార్డులు, బ్లాకులు నిర్మించనున్నారు. భవన నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించగా.. ఫర్నీచర్‌ సమకూర్చే బాధ్యతలను టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ హైదరాబాద్‌కు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభంకానున్నట్లు ఇప్పటికే పలు సందర్భాలలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కళాశాల నిర్మాణానికి నిధులు విడుదల చేయాల్సి ఉంది.

మెడికల్‌ కళాశాల డిమాండ్‌ను తెరమీదకు తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’

వైద్యకళాశాల కోసం దశాబ్దాలుగా మెదక్‌ జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మెదక్‌ కేంద్రంగా అప్పట్లో మంజూరైన మెడికల్‌ కళాశాలను సంగారెడ్డికి తరలించారు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా మూడు జిల్లాలుగా రూపాంతరం చెందింది. అనంతరం సిద్దిపేట జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటైంది. ఈ క్రమంలో మెదక్‌పై వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే మెడికల్‌ కళాశాల డిమాండ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ తెరపైకి తెచ్చింది. పలుమార్లు కథనాలు ప్రచురించింది. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెడికల్‌ కళాశాల కోసం చాలాకాలంగా కృషి చేశారు. పలుమార్లు అసెంబ్లీ వేదికగా మంత్రి హరీశ్‌రావు ప్రకటన చేశారు. తాజాగా జిల్లాకు వైద్యకళాశాలను ఏర్పాటు చేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం కేసీఆర్‌ కృషి వల్లే సాధ్యమైంది : ఎమ్మెల్యే పద్మారెడ్డి

మెదక్‌ జిల్లాకు మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాందాస్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టపాసులు కాల్చి..స్వీట్లు పంచిపెట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెదక్‌కు వైద్యకళాశాల మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. మెడిసిన్‌ చదవాలన్న విద్యార్థులు కోరిక సాకారమవుతుందని చెప్పారు. మెడికల్‌ కళాశాలతోపాటు నర్సింగ్‌ కళాశాల కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ కృషి వల్లే సాధ్యమైందన్నారు. వైద్యకళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంబురాల్లో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కేశ్రీను, జయరాజ్‌, నిజాంపేట ఎంపీపీ సిద్దిరాములు, మెదక్‌, హావేళిఘణపూర్‌, రామాయంపేట మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-06T00:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising