ఏఐఎంఐఎం నాయకులతో ఎమ్మెల్యే సమావేశం
ABN, First Publish Date - 2023-01-29T23:23:33+05:30
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం బీదర్ జిల్లాకు చెందిన ఏఐఎంఐఎం నాయకులతో ఆదివారం నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమావేశమయ్యారు.
నారాయణఖేడ్, జనవరి 29: కర్ణాటకలోని బీదర్ జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం కోసం బీదర్ జిల్లాకు చెందిన ఏఐఎంఐఎం నాయకులతో ఆదివారం నారాయణఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీదర్ జిల్లా ఏఐఎంఐఎం అధ్యక్షుడు మన్సూర్అహ్మద్ఖాద్రి, నాయకులు అబ్దుల్ ఖాదిర్, ఒబేదుల్లాఖాదిర్, మజార్‌ఖాన్, సలీమోద్దిన్, సయ్యద్ సమి, హుస్సేన్బాబా, వాసీంహుస్సేన్, షకీల్, మజీద్, యూసు్ఫలతో మాట్లాడారు. దేశ ప్రజలంతా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలకు ఆకర్షితులవుతున్నారన్నారు. బీఆర్‌ఎ్‌సను బలోపేతం చేయడం కోసం పార్టీలో చేరాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే బీదర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వారికి తెలిపారు. అనంతరం ఏఐఎంఐఎం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సమావేశంలో ఖేడ్ మున్సిపల్ చైర్పర్సన్ రుబీనాబేగంనజీబ్, నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ బాసిత్, అబ్బెంద సర్పంచు సుదర్శన్పాటిల్ పాల్గొన్నారు. కంగ్టి మండలం రాంతీర్థ్కు చెందిన రతిబాయికి ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కును అందించారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖేడ్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. కార్యక్రమంలో షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు అబ్దుల్ సాజీద్, మిస్కిన్ పాల్గొన్నారు. నాగల్గిద్ద మండలానికి చెందిన నలుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
Updated Date - 2023-01-29T23:23:34+05:30 IST