ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల దరిచేరని పక్కా ఇళ్లు: చాడ వెంకటరెడ్డి

ABN, First Publish Date - 2023-02-07T23:52:13+05:30

హుస్నాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 7: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా పాలక ప్రభుత్వాల విధానాల మూలంగా పేదల బతుకుల్లో చీకటి తొలగిపోలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

సీపీఐ సమావేశంలో మాట్లాడుతున్న చాడ వెంకటరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుస్నాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 7: భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా పాలక ప్రభుత్వాల విధానాల మూలంగా పేదల బతుకుల్లో చీకటి తొలగిపోలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హుస్నాబాద్‌ మండలం కూచనపల్లిలో సీపీఐ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల బతుకుల్లో వెలుగు కనపడడం లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాల ద్వారా భూములు లేని పేదలకు భూములు పంపిణీ చేయడం జరిగిందని, ఇంటి స్థలం లేని పేదలకు స్థలాలు ఇప్పించిన ఘనత సీపీఐకే దక్కిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. అర్హులైన పేదలకు పక్కాఇళ్లు నిర్మించాలని అందుకోసం మరోపోరాటానికి సీపీఐ సిద్ధమవ్వక తప్పదన్నారు. కలెక్టర్‌ స్పందించి కూచనపల్లితో పాటు జిల్లాలో పూరిగుడిసెల్లో జీవిస్తున్న వారిని గుర్తించి వారికి నివాస స్థలంతో పాటు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోయిని అశోక్‌, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి యెడల వనేష్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు కొహెడ కొంరయ్య, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జనగామ రాజ్‌కుమార్‌, మండల నాయకులు రఘుపతి, మల్లయ్య, సిద్ధయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T23:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising