ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసురు తీస్తున్న కాలుష్యం

ABN, First Publish Date - 2023-02-10T00:22:52+05:30

పర్యావరణ నిబంధనలకు పాతరేసి రెడ్‌ కేటగిరీ పరిశ్రమలు కాలుష్య జలాలను జలవనరుల్లోకి వదులున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రసాయన పరిశ్రమలతో ప్రాణ సంకటం

జల వనరుల్లోకి గుట్టుగా వ్యర్థాలు

భూగర్భ జలాలు ఙవిషపూరితం

ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలు

సదాశివపేట, ఫిబ్రవరి 9 : పర్యావరణ నిబంధనలకు పాతరేసి రెడ్‌ కేటగిరీ పరిశ్రమలు కాలుష్య జలాలను జలవనరుల్లోకి వదులున్నాయి. రసాయన వ్యర్థాలున్న జలాలను శుద్ధి చేసిన అనంతరమే బయటి వదలాల్సి ఉన్నా అవేమీ లేకుండానే గుట్టుగా చెరువులు, కుంటలు, సాగునీటి కాలువలు, వాగుల్లో డంప్‌ చేస్తున్నారు. దీంతో జలవనరులు విషపూరితమవుతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ నీటిని తాగి తరచుగా మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. సమీప గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారు. సదాశివపేట మండలం ఆరూర్‌, నందికంది గ్రామాల పరిధిలో హైవే 65 పక్కనే ఉన్న రసాయన పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఇవి ప్రభావం చూపుతున్నాయి. నందికంది, ఆరూర్‌, సిద్ధాపూర్‌, రేజింతల్‌, కోణాపూర్‌, నాగులపల్లి తదితర గ్రామాలతో పాటు సదాశివపేట పట్టణం వరకు ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వెలువడుతున్నది. ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండడం లేదు.

ఇష్టారాజ్యంగా వ్యర్థాల డంప్‌

ఆరూరు, నందికంది గ్రామాల పరిసరాల్లో ఉన్న రసాయన పరిశ్రమ విష జలాలను సాగునీటి కాల్వ ద్వారా మంజీరా నదిలోకి వదిలి పెడుతున్నది. కంటాలపల్లి సమీపంలోని మరో భారీ కెమికల్‌ కంపెనీ వ్యర్థ జలాలను భూగర్భంలోకి పంపిస్తున్నదని ఆరోపణలున్నాయి. గత నెల 29వ తేదీన నందికంది సమీపంలోని పరిశ్రమ నుంచి కాల్వలోకి వదిలిన విషజలాలను తాగడంతో ఏకంగా 42 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. ఆరూర్‌ సమీపంలోని ఓ పరిశ్రమ నుంచి వెలువడే రసాయన వ్యర్థాల కారణంగా ఆరూర్‌, కోణాపూర్‌, నాగులపల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమై తాగడానికి నీరు దొరకని దుస్థితి నెలకొన్నది. ఆయా గ్రామాల్లో సదరు పరిశ్రమ యాజమాన్యం తూతూమంత్రంగా మినరల్‌ వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేసి అరకొరగా నీటిని సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. కాలుష్యం కారణంగా కోనాపూర్‌, నాగులపల్లి గ్రామాల్లో మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మహిళలకు గర్భస్రావాలు జరగడం, పిల్లలు అంగవైకల్యం బారినపడడం జరుగుతున్నదని ఆవేద వ్యక్తంచేస్తున్నారు. ఆరూర్‌ సమీపంలోని ఓ కెమికల్‌ పరిశ్రమ నుంచి వెలువడిన విష జలాల కారుణంగా తన కూతురు అంగవైకల్యానికి గురైందని నాగులపల్లి గ్రామానికి చెందిన జ్యోతి(14) తండ్రి పెద్ద జోగుమల్లేశం ఆరోపించారు.

ప్రమాదం జరిగితేనే హడావిడి

రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై ప్రజలు ఆందోళన చేసినప్పుడే స్పందించే అధికారులు కంటితుడుపుగా కేసులు నమోదు చేస్తున్నారు. ఆ తరువాత కుసులు ఏమయ్యాయో తెలియడం లేదు. ఇటీవల నందికంది సమీపంలో కలుషిత జలాలు తాగడంతో 42 గొర్రెలు మృత్యువాతపడిన ఘటనపై రైతులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కాలుష్య జలాల తీవ్రత, రైతుల ఆందోళన మీడియాలో వైరల్‌గా మారడంతో ఘటన జరిగిన మరుసటిరోజు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిణి వసంతకుమారి పరిశ్రమ పరిసరాలను పరిశీలించి పరిశ్రమ కాలుష్య జలాలు వదులుతున్నది వాస్తవమేనని నిర్ధారించారు. గొర్రె కాపరులకు, రైతులకు న్యాయం చేకూరుస్తామని హామి ఇచ్ఛారు. చనిపోయిన గొర్రెలకు పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. పరిశ్రమ నుంచి వెలువడిన వ్యర్థ జలాల శాంపిళ్లను సేకరించారు. యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పీసీబీ, పశువైద్యాధికారులు ఇచ్చే రిపోర్టుపైనే పరిశ్రమలపై తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి. అలాగే, ఫిబ్రవరి 2న జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి బ్లూక్‌క్రాఫ్ట్‌ పరిశ్రమను సందర్శించారు. కాలుష్య జలాల విడుదల, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబందిత శాఖల అధికారులను తీవ్రంగా మందలించారు. 15 రోజుల్లో కాలుష్యంపై పూర్తి స్థాయిలో నివేదికలు అందజేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు.

మూగజీవాలు మృత్యువాత : బషీర్‌మియా, నందికంది

నందికంది గ్రామ పరిధిలో ఉన్న కెమికల్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వాయు, జల కాలుష్యం కారణంగా మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం రూ. లక్షకు పైగా విలువైన ఆవు, మేకలు, గొర్రెలు చనిపోవడంతో మా కుటుంబం ఉపాధి కోల్పోయింది. భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండటం లేదు. అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు.

Updated Date - 2023-02-10T00:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising