ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాసిరకంగా కల్వర్టు నిర్మాణం పనులు

ABN, First Publish Date - 2023-05-02T23:31:05+05:30

చేర్యాల, మే 2: పంచాయతీరాజ్‌ అధికారుల పర్యవేక్షణా లోపం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా చేర్యాల మండలం తాడూరు గ్రామశివారులోని కాజ్‌వే కల్వర్టు నాలుగు నెలలు కూడా నిలువకుండాపోయింది.

మట్టి తొలగిస్తుండగా కూలిన రెయిలింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టించుకోని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు

చేర్యాల, మే 2: పంచాయతీరాజ్‌ అధికారుల పర్యవేక్షణా లోపం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా చేర్యాల మండలం తాడూరు గ్రామశివారులోని కాజ్‌వే కల్వర్టు నాలుగు నెలలు కూడా నిలువకుండాపోయింది. పనులు నాసిరకంగా చేపట్టడంతో ప్యారాఫీట్‌ రెయిలింగ్‌ పగుళ్లుపట్టింది. సీసీస్లాబ్‌పై కంకర తేలింది. కల్వర్టు నిర్మాణం అనంతరం పక్క నుంచి వేసిన బైపా్‌సను క్లియర్‌ చేయకపోవడంతో ఇటీవల కురిసిన వ ర్షానికి వరదనీరు రైతు పొలాల్లో నిల్వడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై చుట్టుపక్కల రైతులు పంచాయతీరాజ్‌శాఖ ఏఈకి ఎన్నిసార్లు తెలిపినా పట్టించుకోలేదు. డీఈ శ్రీనివా్‌సరెడ్డికి ఫిర్యాదు చేయడంతో నీటి మళ్లింపుకు మట్టిని తొలగించాలని సూచించారు. దీంతో మట్టిని తొలగిస్తుండగా, అప్పటికే బాగా పగుళ్లుపట్టిన ప్యారాఫీట్‌ రెయిలింగ్‌ వాల్‌ కూలిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ విషయమై పీఆర్‌ ఏఈ శివకు ఫోన్‌చేసినా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో డీఈ శ్రీనివా్‌సరెడ్డిని వివరణ కోరగా కోతకు గురైన ప్యారాఫీట్‌ వాల్‌ను తొలగించి సరిచేయించిన తర్వాత కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-02T23:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising