ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో మెరిసిన సిద్దిపేట జిల్లా

ABN, First Publish Date - 2023-03-01T00:00:07+05:30

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023 గ్రామీణ ర్యాంకుల్లో భాగంగా మొదటి త్రైమాసిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డు ప్రకటన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

స్వచ్ఛసర్వేక్షణ్‌ 2023 గ్రామీణంలో జిల్లాకు ప్రథమ స్థానం

సిద్దిపేట టౌన్‌, ఫిబ్రవరి28: స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023 గ్రామీణ ర్యాంకుల్లో భాగంగా మొదటి త్రైమాసిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లాలోని అన్నీ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికార యంత్రాగాన్ని, సిబ్బందిని మంత్రి హరీశ్‌రావు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ విజన్‌తో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైందన్నారు.అన్ని గ్రామపంచాయతీలలో పల్లెప్రగతి కార్యక్రమాలను పకడ్భందీగా అమలు చేయడం ద్వారా, గ్రామాలు సంపూర్ణ స్వచ్ఛ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు పాఠశాలల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో, పంచాయతీల్లో మరుగుదొడ్ల సౌకర్యం, ఘన, ద్రవ వ్యర్థాల ఏర్పాట్లు, తదితర కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా, సిద్దిపేట జిల్లా మూడో స్టార్‌ కేటగిరి నుంచి నాలుగో స్టార్‌ కేటగిరికి చేరినట్లు పేర్కొన్నారు. మొదటి త్రైమాసిక ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నమోదైన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గ్రామపంచాయతీలో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రజాప్రతినిధులు, ప్రభు త్వ సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ అభినందనలు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రెండో స్థానంలో, కేరళ రాష్ట్రంలోని కొట్టా యం జిల్లా మూడోస్థానంలో నిలిచింది.

Updated Date - 2023-03-01T00:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!