ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లీకేజీ దొంగల్ని జైల్లో పెట్టడంతో ప్రశాంతంగా పరీక్షలు

ABN, First Publish Date - 2023-04-07T02:43:32+05:30

పేపర్ల లీకేజీలకు పాల్పడ్డ దొంగలను జైల్లో పెట్టడం వల్లే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కేసీఆర్‌ నేతృత్వంలో అనూహ్య అభివృద్ధి: మంత్రి హరీశ్‌

సంగారెడ్డి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): పేపర్ల లీకేజీలకు పాల్పడ్డ దొంగలను జైల్లో పెట్టడం వల్లే విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ధనసిరి గ్రామంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రజలు ఊహించని రీతిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతిపక్ష నేతలు వచ్చి కన్నీరు కారుస్తారన్నారు. కరిగిపోతే ఖతమైపోయినట్లేనని హెచ్చరించారు. గతంలో బీజేపీ తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి విఫలమైందన్నారు. ఇప్పుడా పార్టీ నేతలు పేపర్ల లీకేజీ పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధికి పునాదులు వేసి ప్రజలు చల్లగా ఉండాలని చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం మసీదులను తవ్వే పనుల్లో ఉంటూ మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. రాహుల్‌ గాంధీని పీకేస్తే ఏమీ చేయలేని కాంగ్రెస్‌.. ప్రజల్ని ఎలా కాపాడుతుందని అన్నారు. బీజేపీని ఢీకొట్టే సత్తా కేవలం బీఆర్‌ఎ్‌సకే ఉందని హరీశ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-07T02:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising