జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేతలు వీరే
ABN, First Publish Date - 2023-01-11T23:21:32+05:30
హుస్నాబాద్ పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల పైనల్‌మ్యాచ్‌ను సిద్దిపేట జిల్లా అడిషనల్ డీసీపీ సందెపోగు మహేందర్ బుధవారం రాత్రి ప్రారంభించారు.
హుస్నాబాద్‌రూరల్, జనవరి 11: హుస్నాబాద్ పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల పైనల్‌మ్యాచ్‌ను సిద్దిపేట జిల్లా అడిషనల్ డీసీపీ సందెపోగు మహేందర్ బుధవారం రాత్రి ప్రారంభించారు. మహిళా విభాగంలో హుస్నాబాద్ మోడల్ స్కూల్- మల్లంపల్లి హైస్కూల్ తలపడగా విజేతగా మల్లంపల్లి జట్లు నిలిచింది. పురుషుల విభాగంలో హుస్నాబాద్ - చౌటపల్లి జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పైనల్ మ్యాచ్‌లో చౌటపల్లి టీం విజయం సాధించింది. విజేత జట్లకు అడిషనల్ డీసీపీ సందెపోగు మహేందర్ చేతుల మీదుగా రూ. 10 వేలు, రన్నర్ జట్టుకు రూ. 5 వేల క్యాష్ అవార్డును అందజేశారు. ప్లడ్ లైట్ల మధ్యన జరిగిన ఈ పోటీలను తిలకించేందుకు యువకులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వెంకన్న, ట్రాఫిక్ ఏసీపీ ఫణీందర్, హుస్నాబాద్ సీఐ ఎర్రల కిరణ్, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట ఎస్‌ఐలు సజ్జనపు శ్రీధర్, నరేందర్‌రెడ్డి, వివేక్, పీడీ సత్యనారాయణ, పీఈటీలు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-11T23:21:34+05:30 IST