సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం

ABN, First Publish Date - 2023-05-20T00:17:24+05:30

గజ్వేల్‌, మే 19: సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని వీఆర్‌ఏల సంఘం గజ్వేల్‌

సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం
గజ్వేల్‌లో కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీఆర్‌ఏల సంఘం గజ్వేల్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఆంజనేయులు

గజ్వేల్‌, మే 19: సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని వీఆర్‌ఏల సంఘం గజ్వేల్‌ డివిజన్‌ అధ్యక్షుడు నిరుడి ఆంజనేయులు అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ ఎదుట సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాబినేట్‌ మీటింగ్‌లో వీఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేస్తూ ఆమోదం తెలపడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. వారితో వీఆర్‌ఏల సంఘం నాయకులు ఎర్ర రఘువరన్‌, పెర్క శ్రీనివాస్‌, యాదగిరి, వెంకట్‌నర్సయ్య, నగేశ్‌, నవీన్‌, రవిందర్‌, భిక్షపతి, డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల వీఆర్‌ఏలు ఉన్నారు.

కొండపాక: వీఆర్‌ఏలను క్రమబద్ధీకరిస్తామని నిర్ణయించడంతో సీఎం చిత్రపటానికి కొండపాకలో శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం నాయకుడు కిష్టయ్య మాట్లాడారు.

సిద్దిపేట అర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు ఎప్పుడూ రుణపడి ఉంటామని వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఐరేని రవీందర్‌ అన్నారు. శుక్రవారం వీఆర్‌ఏల ఆధ్వర్యంలో సిద్దిపేటలో కేసీఆర్‌, హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

Updated Date - 2023-05-20T00:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising