ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీరు వృథా

ABN, First Publish Date - 2023-03-07T00:15:50+05:30

రైతులకు కాలువల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాలువల నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ, డిస్ట్రిబ్యూటరీ కాలువల తవ్వకం పనులు అసంపూర్తిగా ఉండడంతో సాగునీరంతా వృథాగా పోతున్నది.

ముండ్రాయి శివారులోని బహుదూర్‌ వ్యవసాయ బావి సమీపంలో వృథాగా పోతున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పొలాల వెంట చిన్నధారగా పారుతున్న కాళేశ్వర జలాలు

డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం పూర్తికాకపోవడంతో నిండని చెరువులు

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

నంగునూరు, మార్చి 6 : రైతులకు కాలువల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాలువల నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ, డిస్ట్రిబ్యూటరీ కాలువల తవ్వకం పనులు అసంపూర్తిగా ఉండడంతో సాగునీరంతా వృథాగా పోతున్నది.

కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా అందించాలనే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో రంగనాయకసాగర్‌ ద్వారా నంగునూరు మండలంలో మెయిన్‌ కెనాల్‌ నిర్మాణ పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టారు. మెయిన్‌ కెనాల్‌ నుంచి డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా గ్రామాల్లోని చెరువులను నింపేందుకు పిల్ల కాలువల నిర్మాణం చేపట్టారు. సంబంధిత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ కాలువల పనులు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది మండలంలోని లెఫ్ట్‌ డిస్ర్టిబ్యూటరీ 4,(1) కాలువ పనులు పూర్తి చేయకపోవడంతో కాళేశ్వరం నీరు చెలకలు పట్టుకొని వృథాగా పోతున్నాయి. మండలంలోని ముండ్రాయి గ్రామ శివారులో గల బహుదూర్‌ వ్యవసాయ బావి సమీపంలో డిస్ట్రిబ్యూటరీ కాలువ నుంచి వదిలివేయడంతో పంట పొలాల వెంట, బీడు భూముల మీదుగా పారుకుంటూ రాజగోపాల్‌పేట పెద్దచెరువులోకి చిన్నధారగా వెళుతోంది. ముండ్రాయి శివారులో 20 మీటర్ల కాలువ తీసి చెరువు పారకం కాలువలో కల్పినట్టు అయితే సాఫీగా నీళ్లు వెళ్లిపోతాయని ఆయకట్టు రైతులు తెలిపారు.

తెగిపోయిన పిల్ల కాలువ

ముండ్రాయి- కోనాయిపల్లి వెళ్లే మెయిన్‌ కాలువ లెఫ్ట్‌ డిస్ట్రిబ్యూటరీ నుంచి పాలమాకుల చెరువులోకి వెళ్లే పిల్ల కాలువ నాసిరకంగా నిర్మించడం వల్ల, అది ముండ్రాయి శివారులో తెగిపోయింది. దీంతో కాలువను మూసివేశారు. ఇక్కడి కాల్వ 20 మీటర్లు సీసీ వేసినట్లయితే పాలమాకుల చెరువు నిండుకుండలా మారుతుంది. పలుమార్లు మంత్రి హరీశ్‌రావు కాలవల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో స్పందన లేకుండా పోతున్నది. డిస్ట్రిబ్యూటరీ కాల్వల అసంపూర్తి పనులపై పలుమార్లు రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయినా పనులు సాగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసంపూర్తి పనులతో నిండని చెరువులు

ప్రభుత్వం కరువు రావద్దు, రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోవద్దు అనే ఉద్దేశంతో మండువేసవిలో సైతం కాలువల ద్వారా సాగునీటిని వదిలినప్పటికీ మండలంలోని రాజగోపాలపేట పెద్ద చెరువు, నర్మెట్ట గద్దలాయచెరువు, పాలమాకులుర చెరువు, కోనాయిపల్లి చెరువుకు నేడు నీరు రాని పరిస్థితి నెలకొన్నది. కొద్దిపాటి అసంపూర్తి పనులకే చెరువులు నిండకుండా నీరంతా వృథా పోతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణాలను పూర్తి చేసి చెరువులను నింపాలని కోరుతున్నారు.

Updated Date - 2023-03-07T00:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising