Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్యకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
ABN, First Publish Date - 2023-04-14T16:02:11+05:30
అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు, ‘బలగం’ (Balagam) మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు, ‘బలగం’ (Balagam) మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు. మొగిలయ్య (Mogilaiah) దీర్ఘకాలంగా డయాబెటిస్ (Diabetes), బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. మొగిలయ్యకు ఛాతి నొప్పి రావడంతో వరంగల్ నుంచి నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌కు వెళ్లిన ఎర్రబెల్లి.. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశాలిచ్చారు. మొగిలయ్య వైద్యానికి అయ్యే ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మొగిలయ్యకు డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా సమయంలో రెండు కిడ్నీలు విఫలమై తీవ్ర అనారోగ్యంతో బాధ్యపడుతున్న మొగిలయ్య రెగ్యులర్‌గా డయాలసిస్ చేయాల్సి ఉంది. దానికి కూడా ఇప్పుడు ఆ ఆరోగ్యం సహకరించడం లేదని ఇటీవల మొగులయ్య దంపతులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’ సినిమా పతాక సన్నివేశాల్లో ‘తోడుగా మా తోడుండి' అంటూ మొగిలయ్య దంపతులు పాడిన పాట అందరి గుండెను కదిలించింది. బలగం విడుదల తర్వాత ఆయన ఆర్థికి పరిస్థితి తెలుసుకున్న ‘బలగం’ దర్శకుడు వేణు లక్ష రూపాయలు సాయం అందించాడు. మంత్రి హరీశ్ రావు స్పందించి మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2023-04-14T16:02:11+05:30 IST