ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాకారుల పుట్టినిల్లు మిర్యాలగూడ

ABN, First Publish Date - 2023-03-16T00:19:36+05:30

కళాకారుల పుట్టినిల్లు మిర్యాలగూడ అని జాతీయ అవార్డు గ్రహీత, లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ మాజీ గవర్నర్‌ ముడంబై రామానుజాచార్యులు అన్నారు. బుధవారం పట్టణంలోని హౌజింగ్‌బోర్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటకపోటీల్లో ఆరో రోజు కార్యక్రమాలను నాటక సమాజాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి పిచ్చయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అత్యద్భుత ప్రతిభ ఉన్న ఈ ప్రాంత కళాకారులు వివిధ విభాగాల్లో రాణిస్తూ పట్టణానికి దేశవ్యాప్త గుర్తింపు తేవడం ఆనందకరమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మిర్యాలగూడ టౌన్‌, మార్చి 15: కళాకారుల పుట్టినిల్లు మిర్యాలగూడ అని జాతీయ అవార్డు గ్రహీత, లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ మాజీ గవర్నర్‌ ముడంబై రామానుజాచార్యులు అన్నారు. బుధవారం పట్టణంలోని హౌజింగ్‌బోర్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటకపోటీల్లో ఆరో రోజు కార్యక్రమాలను నాటక సమాజాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి పిచ్చయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అత్యద్భుత ప్రతిభ ఉన్న ఈ ప్రాంత కళాకారులు వివిధ విభాగాల్లో రాణిస్తూ పట్టణానికి దేశవ్యాప్త గుర్తింపు తేవడం ఆనందకరమన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖతో సత్సంబంధాలు కలిగి ఉంటూ కార్యక్రమాలు నిర్వహించడం హర్షనీయమన్నారు. హైదరాబాద్‌కు చెందిన కాటన్‌ కాల్‌ ఽథియేటర్‌ కళాకారులు ప్రదర్శించిన ‘పెట్రోమాక్స్‌ పంచాయితీ’ సాంఘిక నాటిక సందేశాత్మకంగా ఉంది. కర్నూలుకు చెందిన లలిత కళాసమితి బృందం చేసిన శ్రీకృష్ణ కమలాపాలిక పద్యనాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమంలో కేంద్ర అధ్యక్షుడు బోయినపల్లి భుజంగరావు, ఎక్స్‌ కౌన్సిలర్‌ పశ్యా శ్రీనివాసరెడ్డి, పులి కృష్ణమూర్తి, పుల్లాభట్ల లక్ష్మీనారాయణశర్మ, పరిమి రామావతారం, క్ణృష్ణమూర్తి, ఉపేందర్‌, శ్రీనివాసశర్మ, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-16T00:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising