ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Jaggareddy : రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు బీజేపీ కుట్ర

ABN, First Publish Date - 2023-07-14T03:55:26+05:30

ప్రధాని మోదీని ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో నిలదీస్తున్నారనే కక్షతోనే రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధరల పెరుగుదలపై బదులు చెప్పలేకే మోదీ కుయుక్తి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీని ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో నిలదీస్తున్నారనే కక్షతోనే రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. నిత్యావసర ధరలు పెంపు అంశంపై పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ గొంతు వినపడొద్దని, ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాజకీయ దుర్బుద్ధితో మోదీ కుట్రలు చేశారని విమర్శించారు. రాహుల్‌ గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన సేవలు, ప్రాణాత్యాగాలు చరిత్రలో లేకుండా చేయాలనే రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు.రాహుల్‌ నాయకత్వం మీద, వారి కుటుంబం మీద ఉద్దేశపూర్వకంగానే మోదీ సర్కారు రాజకీయంగా నిందలు వేస్తుందని విమర్శించారు. 130 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రను కనుమరుగు చేయాలని బీజేపీ, ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వంట గ్యాస్‌ ధరలు, జీఎస్టీ పేరుతో సామాన్యునిపై పెరిగిన ఆర్థిక భారంపై రాహుల్‌ పార్లమెంట్‌లో నిలదీస్తారనే భయంతోనే సభ్యత్వాన్ని తొలగించారని చెప్పారు. రాహుల్‌ ఎంపీగా కొనసాగితే ప్రధాని అవుతారని భావించి రాజకీయ కుయుక్తులకు తెరలేపారని అన్నారు. రాహుల్‌ గాంధీని, కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొలేక మోదీ చేసిన కుట్ర అని జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వీరసైనికుల్లా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-14T03:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising