ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Mecha Nageswara Rao: మెచ్చాపై అసమ్మతి గళం

ABN, First Publish Date - 2023-01-30T03:01:41+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీరును ప్రశ్నిస్తూ ఆ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌ గళమెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటెద్దు పోకడలతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు

కార్యకర్తలను తొక్కేస్తూ అక్రమార్కులకు అందలం

కుటుంబ సభ్యులతో దళితబంధులో వసూళ్లు

అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై

ఎంపీపీ, సొసైటీ చైర్మన్‌ తదితర నేతల ఆరోపణ

చండ్రుగొండ, జనవరి 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీరును ప్రశ్నిస్తూ ఆ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌ గళమెత్తింది. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు పోతున్నారని కొంతకాలంగా గుర్రుగా ఉన్న ఎంపీపీ పార్వతి, సొసైటీ చైర్మన్‌ చందర్‌రావు, పార్టీ చండ్రుగొండ మండల మాజీ అధ్యక్షుడు భోజ్యానాయక్‌, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అయిన్నపాలెంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 8 మంది సర్పంచులు, ఐదుగురు ఎంపీటీసీలతో పాటు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. ఎంపీపీతో పాటు ముఖ్య నేతలు మాట్లాడుతూ.. అప్పటి మండల పార్టీ అధ్యక్షుడు భోజ్యానాయక్‌ ఆధ్వర్యంలో మెజారిటీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు ఎంపీపీ పదవిని చేజిక్కించుకున్నామని చెప్పారు.

స్థానిక సంస్థల్లో విజయం సాధించి బలంగా ఉన్న పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే మెచ్చా తన మనషులను అందలమెక్కిస్తూ మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న నాయకులను, ప్రజాప్రతినిధులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎంపీపీని సైతం పరిగణనలోకి తీసుకోకుండా అభివృద్ధి పథకాలను తన మనుషులకు అప్పగిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితబంధు పథకంలో ఆయన కుటుంబ సభ్యులు రూ.లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా వసూళ్లు మాత్రం ఆగలేదన్నారు. ఎమ్మెల్యే తీరుపై గతంలో జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్యే తీరు మారకుంటే కొద్ది రోజుల్లో తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - 2023-01-30T03:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising