ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా ముక్కోటి ఏకాదశి..

ABN, Publish Date - Dec 23 , 2023 | 09:45 AM

యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు.

హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి కి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. సిద్దిపేట లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో స్వామి వారిని మాజీ మంత్రి హరీశ్ రావు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో హరీష్ రావుకు స్వాగతం పలికారు.

వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. వరంగల్ చౌరస్తాలోని గీతా భవన్‌లో వేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కాశిబుగ్గలోని రంగనాయక స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక వరంగల్‌లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బట్టల బజార్‌లోని బాలానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు జరిగాయి. ఆ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెంకటేశ్వర స్వామి, గంగాపురంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు హరి హరులు దర్శనం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

జగిత్యాల జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూర్ ఎమ్మేల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి దంపతులు పాల్గొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - Dec 23 , 2023 | 09:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising