ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad:వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN, Publish Date - Dec 14 , 2023 | 10:26 PM

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠ శాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ ఉప సంచాలకురాలు ఆర్‌ రమాదేవి సూచించారు.

ముల్యాంకనం పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమ ఉపసంచాలకురాలు రమాదేవి

ఆసిఫాబాద్‌ రూరల్‌, డిసెంబరు 14: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠ శాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ ఉప సంచాలకురాలు ఆర్‌ రమాదేవి సూచించారు. సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అమలు చేస్తున్న పదో తరగతి వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రాండ్‌ టెస్ట్‌ పేపర్లను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మూల్యంకన శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఈ గ్రాండ్‌ టెస్ట్‌ ఆధారం విద్యార్థుల స్థాయి నిర్ధారించి వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ ఏడాది పదో తరగతిలో 1,173 మంది విద్యార్థులు మార్చిలో జరగబోయే పరీక్షలలో హాజరు కానున్నారన్నారు. విద్యార్థుల కోసం అమలు చేస్తు న్న ప్రత్యేక సమయసారాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పా రు. రోజు వారీగా స్లిప్‌ టెస్ట్‌ నిర్వహించి మూల్యంకనం చేయా లన్నా రు. ఉత్తమ ఫలితాల కోసం సమష్టిగా ఉపాధ్యాయులంతా కృషి చే యాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంఓ ఉద్దవ్‌, ఏటీడీవో క్షేత్ర య్య, జీసీడీవో శకుంతల, డీఎస్‌వో మీనారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 10:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising