2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటాలి
ABN, First Publish Date - 2023-05-13T00:18:40+05:30
వర్షాకాలం ప్రారంభమవుతున్నందున జూన్ 15న ఒకే రోజు జిల్లావ్యాప్తంగా 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.
వచ్చే నెల 15న ఒకే రోజు కార్యక్రమం
ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ రామకృష్ణారెడ్డి
మోత్కూరు, మే 12: వర్షాకాలం ప్రారంభమవుతున్నందున జూన్ 15న ఒకే రోజు జిల్లావ్యాప్తంగా 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాలని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని దత్తప్పగూడెంలో ఆయిల్ ఫెడ్ సిబ్బంది, మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చేనెల 15వ తేదీలోపు మండలాలు, గ్రామాల్లో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో కలిగే లాభాలు, ప్రభుత్వ సబ్సిడీలు వివరించి రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. ఒకే రోజు 2,500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. సమావేశంలో ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి ప్రవీణ్, మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారులు నర్సింహ, సురేష్, కమలాకర్, ఆయిల్ ఫెడ్ ఫీల్డు ఆఫీసర్లు హరీష్, జ్యోత్స్న పాల్గొన్నారు.
Updated Date - 2023-05-13T00:18:40+05:30 IST