ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్వామికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు

ABN, First Publish Date - 2023-11-02T00:06:53+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, నవంబరు 1: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బుధవారం నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వా మిని మేల్కొలిపిన ఆచార్యులు గర్భాలయంలోని స్వయంభువులకు, సువ ర్ణ ప్రతిష్టా అలంకార కవచమూర్తుల ను పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవలో ఊరేగించిన ఆచార్యులు దేవతల సేనానాయకుడు విశ్వక్సేనుడికి తొలి పూజలతో నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. సుదర్శన నారసింహ హవన పూజలు కొనసాగాయి. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి, స్ఫటిక మూర్తులకు నిత్య పూజలు, యాగశాలలో రుద్రహవనం స్మార్త సంప్రదాయరీతిలో నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్య పూజలు కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.11,02,409ల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అఽధికారులు తెలిపారు.

Updated Date - 2023-11-02T00:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising