ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తలే బీఆర్‌ఎస్‌ పార్టీకి బలం

ABN, First Publish Date - 2023-03-28T01:12:45+05:30

బీఆర్‌ఎస్‌ పార్టీ అనంతగిరి, అర్వపల్లి, గరిడేపల్లి మండలాల ఆత్మీయ సమ్మేళనాలను సోమవారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్‌

గాదరి కిషోర్‌కుమార్‌

శానంపూడి సైదిరెడ్డి

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథులుగా హాజరు

అనంతగిరి, అర్వపల్లి, గరిడేపల్లి మార్చి 27: బీఆర్‌ఎస్‌ పార్టీ అనంతగిరి, అర్వపల్లి, గరిడేపల్లి మండలాల ఆత్మీయ సమ్మేళనాలను సోమవారం నిర్వహించారు. ఈ సమ్మేళనాలకు ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్‌, గాదరి కిషోర్‌కుమార్‌, శానంపూడి సైదిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలో నిర్వహిం చిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ మాట్లా డుతూ దేశానికి కేసీఆర్‌ పాలనే శ్రీరామ రక్ష అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు. ప్రధానమంత్రి మోదీని నిలువరించి దేశాన్ని రక్షించగల నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. శ్రుతిమించుతున్న బీజేపీ దుర్మార్గాలను, ప్రజావ్యతిరేక విధానాలను బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పిలు పుమేరకు ఏప్రిల్‌ 27వ తేదీన గ్రామాల్లోని ప్రతి వార్డులో జెండా పండు గను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్య క్షుడు గింజుపల్లి రమేష్‌, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, యాకోబ్‌, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, సత్యనారాయణరెడ్డి, ఈదుల కృష్ణయ్య, విశ్వేశ్వరరావు, సర్పంచ లీలావతి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే సైదిరెడ్డి

బీఆర్‌ఎస్‌ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి కోరారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన హాల్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో గతంలో జరగని అభివృద్ధి తను ఎమ్యేల్యేగా గెలిచిన తర్వాత ఈ మూడేళ్లలో చేశానన్నారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 1200 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరు చేయించానన్నారు. గ్రూప్‌ రాజకీయాలను సహిం చబోనని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు పెండెం శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన కడియం వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్‌, వైస్‌ ఎంపీపీ ప్రమీల, పీఏసీఎస్‌ చైర్మన వీరంరెడ్డి శంభిరెడ్డి, పార్థసారథి గందె వినోద పాల్గొన్నారు.

గోదావరి జలాలతో సస్యశ్యామలం: గాదరి

తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలతో సాగు, తాగునీరు అందించి సస్యశ్యామలం చేశామని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అ న్నారు. అర్వపల్లి మండల కేంద్రంలోని శ్రీయోగా నందలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన మహాసభను బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’, ‘రైతుబీమా’ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.. తుంగతుర్తి నియోజకవర్గంలో ‘దళితబంధు’ పథకానికి సీఎం కేసీఆర్‌ రూ.250 కోట్లు కేటాయించడం అభినందనీ యమన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో శ్రీయోగానందలక్ష్మీనర్సింహస్వామి దేవాలయ నిర్మాణ పనుల కోసం రూ.5 కోట్లు మంజూరు చేయించానన్నారు. అనం తరం బోనాలు, బతుకమ్మలు, పీర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మీనర్సయ్యయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్‌గౌడ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన స్రవంతి, పీఏసీఎస్‌ చైర్మన కుంట్ల సురేందర్‌రెడ్డి, కబడ్డీ జిల్లా అసోసియేషన అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీ టీసీ జీడిబిక్షం, ఎంపీటీసీ కనుకు పద్మశ్రీనివాస్‌, దేవాలయ చైర్మన చిల్లంచర్ల విద్యాసాగర్‌, నాయకులు రజాక్‌, మొరిశెట్టి ఉపేందర్‌, ఎర్ర నర్సయ్య, సర్పంచలు బైరబోయిన సునితరామలింగయ్య, వబ్బెటి జ్యోతిరాణి, బొడ్డు రామలింగయ్య, కుంభం ఉషారాణి, పుప్పాల శేఖర్‌, ఉపేంద్ర, గీత, కర్ణాకర్‌, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-28T19:01:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising