ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంటార్కిటికా అట్లా్‌సలో భువనగిరి ఖిల్లా ప్రస్థానం

ABN, First Publish Date - 2023-04-17T00:17:45+05:30

ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల వివరాలతో అంటార్కిటికా గ్రంఽథాలయం ప్రచురించే అట్లాస్‌ పుస్తకంలో భువనగిరికి ఖిల్లాకు చోటు లభించింది. 2021లో విడుదల చేసి న సంచికలో మొదటిసారిగా భువనగిరి ఖిల్లాను ప్రస్తావించారు. అంటార్కిటికాలోని మంచు ప్రాంతంలో కొనసాగే గ్రంథాలయాన్ని సందర్శించే పర్వతారోహకులు విజిటర్స్‌ బుక్‌లో పేర్కొనే సమాచారం అధారంగా అంటార్కిటికా గ్రంథాలయం పలు మార్గాల్లో వివరాలను రాబట్టి వాస్తవాల ను పరిశీలించి అర్హత ఉన్న పర్వతాల వివరాలను అట్లా్‌సలో ప్రచురిస్తుంది.

అంటార్కిటికా మంచు పర్వతాల్లోని గ్రంథాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 16: ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల వివరాలతో అంటార్కిటికా గ్రంఽథాలయం ప్రచురించే అట్లాస్‌ పుస్తకంలో భువనగిరికి ఖిల్లాకు చోటు లభించింది. 2021లో విడుదల చేసి న సంచికలో మొదటిసారిగా భువనగిరి ఖిల్లాను ప్రస్తావించారు. అంటార్కిటికాలోని మంచు ప్రాంతంలో కొనసాగే గ్రంథాలయాన్ని సందర్శించే పర్వతారోహకులు విజిటర్స్‌ బుక్‌లో పేర్కొనే సమాచారం అధారంగా అంటార్కిటికా గ్రంథాలయం పలు మార్గాల్లో వివరాలను రాబట్టి వాస్తవాల ను పరిశీలించి అర్హత ఉన్న పర్వతాల వివరాలను అట్లా్‌సలో ప్రచురిస్తుంది. పర్వతారోహణ శిక్షణకు అనువైన పర్వతంగా దేశంలోనే ప్రసిద్ధి చెందిన భువనగిరి ఖిల్లా ప్రస్థానం ప్రపం చ పర్వతారోహణ రంగంలో అత్యంత విలువైనదిగా పేర్కొనే అంటార్కటికా అట్లా్‌సలో పేర్కొనడం తెలంగాణకే గర్వకారణమని పర్వతారోహకులు అంటున్నారు. అయితే భువనగిరికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్విత 16 డిసెంబరు 2022న విన్‌సెంట్‌ పర్వతాన్ని అధిరోహించిన సందర్భంగా ఆమె మంచు ప్రాంతంలోని గ్రంథాలయాన్ని సందర్శించడం ద్వారా అట్లా్‌సబుక్‌లో భువనగిరి ఖిల్లా ప్రస్థానం ఉన్నట్లు వెలుగు చూసింది. ఈ మేరకు ఆదివారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అట్లాస్‌ బుక్‌లో భువనగిరి ఖిల్లా ప్రస్థానం ముద్రించి ఉండడాన్ని చూసి తాను ఆశ్చర్యంతోపాటు గర్వంగా ఫీలయ్యానని చెప్పారు. ఏకశిల పర్వతాలలో ఒకటి భారతదేశంలోని తెలంగాణలో భువనగిరి ప్రాంతంలో ఉందని, ఆ పర్వతాన్ని భువనగిరి ఖిల్లాగా పేర్కొంటారని, సాహస క్రీడలకు అనువుగా ఉన్నదని అట్లాస్‌ బుక్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. అంటార్కిటికా అట్ల్‌సలో భువనగిరి ఖిల్లా ప్రస్థానం ఉన్నట్లు ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ ఏకశిలా పర్వతంగా ఉన్న భువనగిరి ఖిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-17T00:17:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising