కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌కు లక్షసార్లు క్షమాపణ చెప్పాలి
ABN, First Publish Date - 2023-06-12T00:22:09+05:30
తెలంగాణకు అన్ని అంశాల్లో తీరని ద్రోహం చేసిన భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ నేతలంతా సీఎం కేసీఆర్‌కు లక్షసార్లు క్షమాపణ చెప్పాలని, ఢిల్లీదాకా ముక్కు నేలకు రాయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీ దాకా ముక్కు నేలకు రాయాలి
తెలంగాణకు తీరని ద్రోహం చేసింది వైఎస్సే
నీళ్లు, విద్యుత్‌పై చర్చకు సిద్ధమా?
మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రతి సవాల్
నల్లగొండ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణకు అన్ని అంశాల్లో తీరని ద్రోహం చేసిన భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ నేతలంతా సీఎం కేసీఆర్‌కు లక్షసార్లు క్షమాపణ చెప్పాలని, ఢిల్లీదాకా ముక్కు నేలకు రాయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని ఆరోపించారు. నాలుగేళ్లుగా దిక్కులేని కరోనా కాలంలో కనబడని నేతలు ఎన్నికలు అనగానే రోడ్లపైకి వచ్చారని, కాంగ్రెస్ పార్టీలో పెత్తనం కోసం పాదయాత్రలు మొదలుపెట్టారన్నారు. దేశానికి నాయకత్వం వహించిన నల్లగొండ జిల్లాను ఎముకల గూళ్లుగా మార్చితే, మిషన్ భగీరథతో ఆరేళ్లలో ఫ్లోరిన్ మహమ్మారిని తరిమినందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలా? అని ప్రశ్నించారు. సాగర్ ఎడమ కాల్వ కింద ప్రతిఏటా రెండు సార్లు సాగునీటిని ఇచ్చామన్నారు. పదవులకోసం ఢిల్లీ బాసుల దగ్గర నోరు మూసుకున్న దరిద్రులు ఈ కాంగ్రెస్ నేతలన్నారు. మీ పాలనలో రాష్ట్రంలో ఎంత వరి సాగయ్యేది, ఇప్పుడు ఎంతవుతుందో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కాకతీయులు, నిజాంల కాలంలో తప్ప మీ కాలంలో ఏ చెరువులోనైనా పిడికెడు మట్టి తీశారా? అని ప్రశ్నించారు. దుర్మార్గమైన టెక్నాలజీతో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని తీసుకొచ్చారు, పర్యావరణ అనుమతులు, పులులు భయపడతాయన్న బెదిరింపులతో ప్రాజెక్టును ఆపేసే ప్రయత్నం చేసి కృష్ణాజలాలను ఆంధ్రాకు తరలించే కుట్ర చేశారన్నారు. తెలంగాణకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకోవాలంటూ ప్రత్యేక రాష్ట్రం రాకుండా చేయాలని చూసిన తెలంగాణ ద్రోహి వైఎస్ అని ఆరోపించారు. లాఠీ దెబ్బలు లేకుండా రైతులకు విత్తనాలు పంపిణీ చేసి, సబ్‌స్టేషన్లపై దాడులు జరగకుండా ఉన్న రోజులు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. మీ పాలనలో రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే, నేడు 10లక్షల ఎకరాల్లో విస్తరించిందని, ప్రతి సీజన్‌లో ధాన్యం కొనుగోలు ద్వారా రూ.2వేలకోట్లు రైతులకు చెల్లిస్తున్నామన్నారు. మీరు పెట్టిన ఏ ప్రాజెక్టు నుంచి కేసీఆర్ పాలనలో విద్యుత్ ఉత్పత్తి అయ్యిందో చెప్పాలని డిమాండ్‌చేశారు. సాగునీరు, విద్యుత్ అంశాలపై చర్చకు సిద్ధమా అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారని, ఏ సాగునీటి ప్రాజెక్టు వద్ద, సబ్‌స్టేషన్ వద్దనైనా తాను చర్చకు సిద్ధమని, మీరు సిద్ధమా? అని ప్రతి సవాల్ విసిరారు. బీజేపీ దుర్మార్గాలను భరించలేక దిక్కులేక కర్ణాటకలో కాంగ్రె్‌సను గెలిపించారని, నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌ను పూర్తిస్థాయిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణినే కాదు రైతుబంధు, 24గంటల ఉచిత విద్యుత్‌ను, ఆసరా పెన్షన్లను రద్దు చేస్తుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, దేవరకొండ, నల్లగొండ, మునుగోడు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్ పాల్గొన్నారు.
సమకాలిన పరిస్థితులను సాహిత్యం ప్రతిబింబిస్తుంది
నల్లగొండ: సమాజహితం, శ్రేయస్సు, సమకాలిన పరిస్థితులను సాహిత్యం ప్రతిబింబిస్తుందని, రాష్ట్ర అద్భుత ప్రగతిని వివరించేలా కవులు, సాహితీ వేత్తలు రచనలు చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ సాహితీ దినోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కవులు, కళాకారులు పాటలు కవితలు రాసి తెలంగాణ ఉద్యమ్యాన్ని ముందుకు నడిపారని, వారి పాత్ర మరువలేనిదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర విజయాలపై రచనలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, దేవరకొండ, నల్లగొండ, మునుగోడు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, అదనపు కలెక్టర్ ఖుష్బూగుప్తా, మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచంద్రనాయక్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-12T00:22:09+05:30 IST