ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యాదగిరిక్షేత్రంలో యాత్రాజనుల సందడి

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:37 PM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తజనులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, డిసెంబరు 30: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తజనులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంతాల్లో భక్తజనుల సంచారంతో రద్దీగా కనిపించాయి. కొండపైన ఉభయ దర్శన క్యూలైన్లు, ప్రసాదాల విక్రయశాల, ఆలయ తిరువీధుల్లో భక్తజనుల సందడి నెలకొంది. ధర్మదర్శనాల్లో గంట, ప్రత్యేక దర్శనాల్లో అరగంట సమయం పట్టిందని, 25 వేల మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. ప్రభాతవేళ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తిరుప్పావై పర్వాలు శాసో్త్రక్తంగా కొనసాగాయి. ప్రధానాలయ ఉత్తర దిశలోని మెదటి ప్రాకార మండపంలో ఆండాళ్‌ అమ్మవారు, శ్రీరంగనాథుడిని కొలుస్తూ తిరుప్పావై పాశుర పఠనం జరిపి కట్టెపొంగలి ప్రసాదాలను నివేదన జరిపి వితరణ చేశారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో ఽధనుర్మాస వేడుకలు వైభవంగా నిర్వహించారు. అంతకుముందుగా నిత్యపూజలు, అభిషేకాలు కొనసాగాయి. అదేవిధంగా ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపంలో విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను ఆగమశాప్త్రరీతిలో నిర్వహించారు. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు, నిత్యరుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర పొల్యూషన కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ అండ్‌ కన్వీనర్‌, ఐఏఎస్‌ అధికారి కృష్ణ ఆదిత్య కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

క్షేత్రంలో సకల సౌకర్యాల కల్పనకు కృషి

యాదగిరిక్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పించే దిశలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ తెలిపారు. శనివారం లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ఆయన స్థపతి వల్లినాయగంతో కలిసి దర్శించుకున్నారు. స్వామి దర్శనాంతరం ఈవో రామకృష్ణారావు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ప్రధానాలయ తిరుమాఢవీధులు, దర్శన క్యూకాంప్లెక్స్‌, గోల్డెన క్యూలైన బాక్సు తదితర ప్రాంతాల్లో ఆయన కలియదిరిగి మాస్టర్‌ ప్లానను పరిశీలించారు. అనంతరం దేవస్థాన ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొండపైన భక్తులకు సరైన వసతుల కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయని, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించే భక్తులు ఎవరూ ఇబ్బందులకు గురికావద్దని, అందుకోసం తగు చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ సూచించారని తెలిపారు. మంత్రి సూచనల మేరకు క్షేత్రాన్ని దర్శించినట్టు, సివిల్‌ ఎలకి్ట్రకల్‌, దేవస్థాన అధికారులు, అర్చకబృందంతో కలిసి భక్తులకు కల్పించాల్సి సౌకర్యాలపై సమీక్షించినట్టు తెలిపారు. వచ్చే రోజుల్లో క్షేత్రాన్ని సందర్శించేందుకు యాత్రాజనులు అధిక సంఖ్యలో తరలివస్తారని, అందుకోసం చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించినట్టు తెలిపారు. దర్శన క్యూకాంప్లెక్స్‌, గోల్డెన క్యూలైన బాక్సుల్లో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించామని, వాటిని సరి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఆర్జిత సేవల నిర్వహణ అనంతరం బయటకు వచ్చిన భక్తులు సేదతీరేందుకు ప్రధానాలయ ఉత్తర దిశలోని గార్డెనలో షెడ్డును నిర్మించాలని ఆదేశించినట్టు తెలిపారు. ప్రధానాలయ అష్టభుజి ప్రాకార మండపాలను భక్తులు దర్శించుకునేలా షెడ్డు నిర్మాణం జరిపేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని, వీటిలో తాత్కాలిక టాయిలెట్స్‌ ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు.

ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీ

మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణంతో కొండపైకి వచ్చే మహిళలతో దేవస్థానంపై భారం పడుతున్నట్టు గుర్తించామని, ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో త్వరలోనే సమీక్షించనున్నట్టు తెలిపారు. యాదగిరిక్షేత్రానికి వచ్చే భక్తులు అస్వస్తతకు గురైతే వైద్య సౌకర్యం అందించేందుకు, వైద్య సేవలు అందించేందుకు వైద్యుల కొరత ఉన్నట్టు గుర్తించామన్నారు. అదేవిధంగా కొండపైన 108 వాహనం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సేవల బోర్డు ఏర్పాటు చేయాలి

కొండపైనన ఏ సేవలు ఎక్కడ పొందాలో తెలిపేలా సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని భక్తులు పెద్దసంఖ్యలో గుట్టను సందర్శిస్తారని, అందుకోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో గజ్వేల్‌ రఘు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising