ప్రసాదంలా బీఆర్‌ఎస్ నేతలకు డబ్బు పంపిణీ
ABN, First Publish Date - 2023-01-07T01:22:06+05:30
దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులకు ప్రసాదం మాది రిగా డబ్బు పంచడానికి రంగం సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఆరోపించారు.
సూర్యాపేట సిటీ, జనవరి 6: దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులకు ప్రసాదం మాది రిగా డబ్బు పంచడానికి రంగం సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఆరోపించారు. సూర్యాపేటలోని త్రివేణి గార్డెన్‌లో నిర్వహించే బీజేపీ పోలింగ్ బూత్ కార్యకర్తల సభా స్థలాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనను అంతం చేయడానికి బీజేపీ సిద్ధ మైందన్నారు. అన్ని నియోజకవర్గాలో ఈ నెల ఏడో తేదీన నిర్వ హించే బీజేపీ పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశాలను విజయ వంతం చేయాలని కోరారు. మంత్రి జగదీష్‌రెడ్డిపై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్నారు. మునుగోడు ఎన్నికలో పంచినట్లు గానే సూర్యాపేటలో ఓటుకు నోటు పంచి గెలుస్తామనే ధీమాలో మంత్రి జగదీష్‌రెడ్డి ఉన్నారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, కర్నాటి కిషన్, వెన్న శశిధర్‌రెడ్డి, మీర్‌అక్బర్, బూర మల్సూర్‌గౌడ్, ఉప్పు శ్రీనివాస్, గణేష్ పాల్గొన్నారు.
Updated Date - 2023-01-07T01:22:07+05:30 IST