మన ఊరు.. మనబడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం
ABN, First Publish Date - 2023-02-02T02:31:43+05:30
మన ఊరు.. మనబడి పథకంతో పాఠశాలలు బలోపేతం అవు తున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మన బస్తీ, మన బడి పథకం కింద బుధ వారం పట్ట ణంలోని సాలార్జింగ్‌పేటలోని ప్రాథమిక పాఠశాలలో, అనంతగిరి మండలంలోని అమీనాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ టౌన్, అనంతగిరి, ఫిబ్రవరి 1: మన ఊరు.. మనబడి పథకంతో పాఠశాలలు బలోపేతం అవు తున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మన బస్తీ, మన బడి పథకం కింద బుధ వారం పట్ట ణంలోని సాలార్జింగ్‌పేటలోని ప్రాథమిక పాఠశాలలో, అనంతగిరి మండలంలోని అమీనాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సర్కారు పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడానికి కార్పొ రేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుం దన్నారు. తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠ శాలల్లో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసు కోవాలన్నారు. కోదాడలోని సాలార్జింగ్‌పేటలోని ప్రాథమిక పాఠశా లలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ మదార్, ఎంఈవో సలీంషరీఫ్, మురళి, ఎంపీపీ కవితారెడ్డి, ముని సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, పద్మ, సాదిక్, మధు, కల్లూరి పద్మజ, లలిత పాల్గొ న్నారు. అనంతగిరి మండలంలోని అమీనా బాద్ గ్రామంలో నిర్వహిం చిన కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గింజుపల్లి రమేష్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ఎంఈవో సలీంషరీఫ్, ఎంపీడీవో విజయ, సర్పంచ్ కోటేశ్వరరావు, పూర్ణచందర్‌రావు, ఎస్‌ఎంసీ చైర్మన్ ఝాన్సీ పాల్గొన్నారు.
పాల్గొన్నారు.
Updated Date - 2023-02-02T02:31:45+05:30 IST