ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌కు పోటెత్తుతున్న ధాన్యం

ABN, First Publish Date - 2023-04-18T00:33:43+05:30

సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతోంది.

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం రాశులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట మార్కెట్‌కు 43వేల బస్తాలు

తిరుమలగిరి మార్కెట్‌కు 27వేల బస్తాలు

సోమవారం ఒక్కరోజే 70వేల పైచిలుకు బస్తాలు రాక

సూర్యాపేట సిటీ, తిరుమలగిరి, ఏప్రిల్‌ 17: సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లకు ధాన్యం పోటెత్తుతోంది. సోమవారం ఒక్క రోజే సూ ర్యాపేట మార్కెట్‌కు 43వేల బస్తాలు, తిరుమలగిరి మార్కెట్‌కు 27వేల బస్తాల ధాన్యం వచ్చింది. యా సంగి సీజన్‌ ధాన్యం రాక ప్రారంభమైనందున రోజు కు 50వేల నుంచి 70 వేల బస్తాల వరకు మార్కెట్‌ కు ధాన్యం వచ్చే అవకాశముందని సూర్యాపేట మా ర్కెట్‌ కార్యదర్శి ఎండీ. ఫసియుద్ధీన్‌ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం పది గంటల లోపు మార్కెట్‌లోకి ధాన్యం ట్రాక్టర్లను అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ-నామ్‌లో గేటు ఎంట్రీ పూర్తి అయిన తర్వాత ఆలస్యంగా మార్కెట్‌ కు వచ్చిన సూమారుగా 10 ధాన్యం ట్రాక్టర్లను మార్కె ట్‌ వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో నిలిపారు. మార్కెట్‌కు అత్యధికంగా జైశ్రీరామ రకం ధాన్యం 17,532 బస్తాలు, ఐఆర్‌64 రకం 15,015 బస్తాలు, హెచ్‌ఎంటీ 9,509 బస్తాల ధాన్యం వచ్చింది. అదేవిధంగా తిరుమలగిరి మార్కెట్‌కు 27, 405 బస్తాల ధాన్యం వచ్చింది. ఆర్‌ఎన్‌ఆర్‌ రకం 312 బస్తాలు 199క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.2,160, కనిష్టంగా రూ.1,803 నమోదైంది. ఐఆర్‌-64 రకం 27,093 బస్తాల్లో 17,339 క్వింటాళ్ల దాన్యం రాగా గరిష్టంగా రూ.1,713, కనిష్టంగా రూ.1456 ధర పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు.

‘పేట’ మార్కెట్‌ అధికారుల తర్జన భర్జన

సూర్యాపేట మార్కెట్‌కు రోజు రోజుకు ధాన్యం రాక పెరుగుతుండడంతో అధికా రులు, ఖరీదుదారు లు, కమీషన్‌దారులు ధాన్యం కాంటాలు, ఎగుమతు ల నిర్వాహణపై తర్జన భర్జన పడుతున్నారు. మార్కెట్‌ కార్యదర్శి ఖరీదుదారులు, కమీషన్‌దారులతో సోమవారం మార్కెట్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మార్కెట్‌కు వచ్చిన మొత్తం ధన్యాన్ని ఏ రోజుకు ఆ రోజు కాంటాలు వేసి, వెం టనే ఎగుమతులు చేయాలని సూచించారు. మార్కెట్‌లో హమాలీల కొరత ఉందని, ఏ రోజుకు ఆ రోజు కాంటాలు వేసి ఎగుమతులు చేయడం సాధ్యం కాదని, బీహార్‌ కూలీలను కొంతమంది మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పనికోసం తీసుకెళ్తున్నారని, మార్కెట్‌లో హమాలీల కొరత ఏర్పడుతుందని ఖరీదుదారులు, కమీషన్‌దారులు మార్కెట్‌ కార్యదర్శి దృష్టికి తెచ్చారు. మార్కెట్‌కు ధాన్యం ఎక్కువ వచ్చిన రోజున గేటు ఎంట్రీ చేయడం, ఆన్‌లైన్‌లో ధరలను బిడ్డింగ్‌ చేయడం, ధరల ప్రకటన ఆ తర్వాత కాంటాలు వేయడం, ధా న్యం బస్తాలను ఎగుమతులు సాధ్యం కాదని కొంతమంది ఖరీదుదారులు పేర్కొన్నారు. ఽధాన్యం ఎక్కువగా వచ్చిన రోజుకు ముందు రోజు మార్కెట్‌కు సెలవు ప్రకటించాలని మరికొంతమంది ఖరీదుదారులు, కమీషన్‌దారులు తెలిపారు. ధాన్యం ఎక్కువ వచ్చిన రోజు మార్కెట్‌కు సెలవు ప్రకటించడం కుదరదని, ఎప్పటికప్పుడు ధాన్యం కాంటాలు వేసి ఎగుమతులను ఖచ్చితంగా చేయాలని మార్కెట్‌ కార్యద ర్శి తెలిపారు. మార్కెట్‌లో ధాన్యం వాహనాలు వెళ్లడానికి వీలుగా ధాన్యం రాసులు పోయాలని, సంత వైపు నుంచి వరుసగా ధాన్యం రాశులను పొసుకుంటూ రైతు విగ్రహం వరకు వరుస క్రమంలో ధాన్యం రాశులను పోయించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతుల ఆగ్రహం

కోదాడ రూరల్‌: ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆగ్ర హం వ్యక్తంచేశారు. సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర పరిధిలోని రైతులు కోదాడ-ఖమ్మం రహదారి పై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన్చ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఆశించిన స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు ఇంతవర కు కేటాయించలేదన్నారు. దీంతో ధాన్యం తూకాలు కాక, తూకం వేసిన ధాన్యం మిల్లులకు తోలక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా తమ్మర ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక రైస్‌మిల్లు కేటాయిస్తే ఆ మిల్లుకు రైతులు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉందన్నారు. కోదాడ-ఖమ్మం రహదారిపై పావు గంట సేపు రైతుల రాస్తారోకో చేయటంతో ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచింది. సమాచారం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్డీవో కిషోర్‌కుమార్‌తో మాట్లాడారు. మంగళవారం నుంచి తమ్మర ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తామని, తూకం వేసిన ధాన్యాన్ని కూడా మిల్లుకు తరలిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా నాయకులు కనగాల నారాయణ, బొల్లు ప్రసాద్‌, కనగాల రాధాకృష్ణ, కమతం వెంకటేశ్వరరావు, మాతంగి ప్రసాద్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.్చ్చ

Updated Date - 2023-04-18T00:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising