ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయించాలి
ABN, First Publish Date - 2023-05-08T00:00:57+05:30
ధాన్యం కొనుగోలు అనంతరం మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయించాలని అదనపు కలెక్టర్ మోహనరావు అన్నారు.
కోదాడ రూరల్, తిరుమలగిరి రూరల్, మునగాల రూరల్, సూర్యాపేట టౌన, మే 7: ధాన్యం కొనుగోలు అనంతరం మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయించాలని అదనపు కలెక్టర్ మోహనరావు అన్నారు. ఆదివారం కోదాడ మండలంలోని తమ్మర, కొమరబండ గ్రామాల్లో రైస్ మిల్లులను ఆయన తనిఖీ చేశారు. ఒక్కో మిల్లులో 20 నుంచి 30వరకు లారీలు దిగుమతి కాకుండా నిలిచి ఉండడంతో మిల్లర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా హమాలీలను ఏర్పా టు చేసి ధాన్యాన్ని దిగుమతి చేయించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం మిల్లుల్లో దిగుమతి కానందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు పేరుకుపోతున్నాయన్నారు. ఆయన వెంట కోదాడ తహసీల్దార్ శ్రీనివాస్‌శర్మ, నడిగూడెం తహసీల్దార్ నాగేశ్వరరావు, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ రాంరెడ్డి, ప్రసాద్, ఆర్‌ఐ కల్యాణి, నగేష్ పాల్గొన్నారు.
తడిసిన ఽధాన్యాన్ని ఆరబెట్టాలి
రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ మోహనరావు కోరారు. మునగాల మండలంలోని నేలమర్రి గ్రామంలో ఐకేపీలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తేమ, తాలు లేకుండా ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఫ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఎగుమతి చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా నాయకుడు కడారి లింగయ్య అన్నారు. తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో ఉప్పలయ్య, సోమయ్య, క్రిష్ణయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
అధికారులు వెంటనే స్పందించాలి
అధికారులు వెంటనే స్పందించి తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కిసాన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్ అన్నారు. మునగాల మండలంలోని మొద్దులచెర్వు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలను తెలుసుకుని మాట్లాడారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో గుర్వయ్య, కాసర్ల శ్రీను, గంగుల హరిబాబు, దేవినేని రవి, గన్నా రవి, గోదేశి నాగేశ్వరరావు, పాలపాటి ప్రవీణ్, జూకూరి రామలింగం, రవి పాల్గొన్నారు.
చివర గింజ వరకు కొనుగోలు చేస్తాం
రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని కోదాడ పీఏసీఎస్ చైర్మన ఆవుల రామారావు అన్నారు. ఆదివారం పీఏసీఎస్ పరిధిలోని గుడిబండ, గణపవరం, తొగర్రాయి, తమ్మరబండపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. నేటివరకు 90శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మిగతా 10శాతాన్ని కూడా వీలైనంత త్వరగా కొనుగోలు చేస్తామన్నారు. తాలు, తేమ లేకుండా నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వట్టే సీతారామ య్య, చంద్రమౌళి, సిబ్బంది వీరబాబు, పవన, సురేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
అకాల వర్షంతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమే్‌షరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అకాల వర్షంతో రైతు లు ఇబ్బందులు పడుతుంటే విద్యుతశాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి యూరప్ దేశాల్లో విహారయాత్రలు చేయడం దారుణమన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులను ప్రభుత్వం కఠినంగా శిక్షించా లని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొ లకెత్తుతుంటే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కాంటాలు వేయకపోవడం సరికాద న్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం ఉందన్నారు. హైదరాబాద్ సోమవారం జరిగే ఏఐసీసీ సభ్యురాలు ప్రియాంకగాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గోదాల రంగారెడ్డి, కౌన్సిలర్ షఫీవుల్లా, స్వామినాయుడు, బంటు చొక్కయ్య, వల్థాస్ దేవేందర్, భాస్కర్‌నాయక్, సైదిరెడ్డి, నాగేశ్వర్‌రావు, రామసాని రమే్‌షనాయుడు, పాలడుగు పరశురాం, బొజ్జ సంజయ్ పాల్గొన్నారు.
Updated Date - 2023-05-08T00:00:57+05:30 IST