ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మార్కెట్‌కు భారీగా పెసర రాక

ABN, First Publish Date - 2023-09-21T00:37:05+05:30

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం భారీగా పెసర పంటను రైతులు తీసుకువచ్చా రు.

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లోని పెసర రాశులు

353 బస్తాల పెసలు తెచ్చిన రైతులు

సూర్యాపేట సిటీ, సెప్టెంబరు 20 : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం భారీగా పెసర పంటను రైతులు తీసుకువచ్చా రు. 77మంది రైతులు 212 క్వింటాళ్ల (353 బస్తాలు) పెసర పంటను మార్కెట్‌కు తీసుకువచ్చినట్లు మార్కెట్‌ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత సీజనలో ఒకే రోజు ఈ స్థాయిలో మార్కెట్‌కు పెసర పంటను తీసుకురావడం ఇదే ప్రథమని అధికారులు తెలిపారు. రోజువారీగా పేట మార్కెట్‌కు 100 బస్తాల నుంచి 150 బస్తాలు మాత్రమే వస్తాయన్నా రు. జిల్లాలోని మద్దిరాల, ఆత్మకూర్‌(ఎస్‌), మోతె, నూతనకల్‌ మండలాలకు ఎస్సారెస్పీ ఆయకట్టులో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో రైతులు వరి స్థానంలో ఎక్కువగా పెసర పంటను సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ మండలాలకు చెందిన రైతులు మార్కెట్‌ కు పెసర పంటను తీసుకువస్తున్నారని మార్కెట్‌ అధికారులు తెలిపారు. ఆగస్టు మొదటి వారం నుంచి సెప్టెంబరు 20 వరకు సూర్యాపేట మార్కెట్‌కు 268 మంది రైతులు 1,573 బస్తాల పెసర పంటను తీసుకువచ్చినట్లు మార్కెట్‌ కార్యదర్శి ఎండీ ఫసియుద్ధీన తెలిపారు.

ఆశాజనకంగా పెసర ధరలు

సూర్యాపేట మార్కెట్‌లో పెసర పంటకు ఆశాజనకంగా ధరలు లభిస్తున్నాయి. పెసర పంటకు మద్దతు ధర రూ.8,558లు ఉండగా, మార్కెట్‌లో రైతులకు రూ.9 వేల కు పైగా ధరలు వస్తున్నాయి. మరోవైపు రం గుమారిన పెసర పంటకు తక్కువ ధరలు ఇస్తున్నారని రైతులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాము తీవ్రంగా నష్టపోయమని, వర్షాలతో పంట రంగు మారిందని తెలిపారు. మార్కెట్‌కు ఎక్కువ స్థాయిలో పంటను తీసుకొస్తే ధరలను తగ్గిస్తున్నారని మండిపడుతున్నారు. వ్యాపారస్థులు కేవలం ఒక రైతుకు మాత్రమే ఎక్కువ ధర ఇచ్చి, మిగతా రైతులకు తక్కువ ధరలు ఇస్తున్నారని ఆరోపించారు. సాగు విస్తీర్ణం తక్కువగా ఉండటం, ప్రైవేటు మార్కెట్‌లో పెసర పంటకు అధిక డిమాండ్‌ ఉండటంతో మార్కెట్‌కు తెచ్చిన పంటను ఒకే ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మంగళవారం మార్కెట్‌కు 280 బస్తాల పెసర పంట రాగా వాటికి ఎక్కువ ధర రూ.9,709 లు, తక్కువ ధర రూ. 5,069 లు వచ్చింది. బుధవారం మార్కెట్‌కు 353 బస్తాల పెసర పంట రాగా, వాటికి ఎక్కువ ధర రూ.9,693లు, తక్కువ ధర రూ.3,669లు ధరలను నిర్ణయించారు.

Updated Date - 2023-09-21T00:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising