ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడం దారుణం

ABN, First Publish Date - 2023-06-09T00:46:39+05:30

తెలంగాణలో నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడం దారుణమని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలిగొండ, జూన్‌ 8: తెలంగాణలో నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడం దారుణమని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈదురు గాలులకు మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో దెబ్బతిన్న ఇళ్లను గురువారం సందర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల అవసరాలను గుర్తించకపోవడం సరికాదన్నారు. ఆర్థిక స్థోమత లేక పక్కా ఇళ్లు కట్టుకోలేని నిరుపేదలు రేకుల ఇళ్లు నిర్మించుకుంటే బుఽధవారం వీచిన ఈదురుగాలులకు ఇంటిపై కప్పులు లేచిపోయాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే తాత్కాలికంగా కంటి తురుపు చర్యగా నామమాత్రపు ఆర్థిక సాయం అందజేయడం సరైంది కాదన్నారు. బాధితులకు శాశ్వత పరిష్కారంగా స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయించి, సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించినట్లుగా రూ.3లక్షలతో ఇంటిని నిర్మించి ఇవ్వాలన్నారు. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, బోళ్ల శ్రీనివాస్‌, గరిసె రవి, పలుసం సతీష్‌, బత్తిని లింగయ్య, సహదేవ్‌, గాడిపల్లి యాదయ్య, మల్లిఖార్జున్‌, కాసుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-09T00:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising