ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
ABN, First Publish Date - 2023-01-28T00:16:44+05:30
జాతీయ జెండాను అవమానించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. వ్యక్తిగత పని నిమిత్తం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జాతీయ జెండాను అవమానించారు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 27: జాతీయ జెండాను అవమానించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. వ్యక్తిగత పని నిమిత్తం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ సభలు, సమావేశాలకు లేని కరోనా భయం, జాతీయ ఉత్సవాలకు కరోనా కారణం చూపడం ఎంత వరకు సమంజసమన్నారు. గణతంత్ర వేడుకలను పరేడ్ మైదానంలో నిర్వహించాలని హైకోర్టు చెప్పినా కూడా నిర్వహించకపోవడానికి సీఎం కేసీఆర్‌కు మనస్సు ఎలా ఒప్పిందన్నారు. ఆగస్టు 15, జనవరి 26ను రాజకీయం చేయకుండా అందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేడ్కర్‌ను గౌరవిస్తూ భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోకుండా సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు అరికట్టలేదని, ఇతర రాష్ట్రాల రైతులకు డబ్బులు ఇస్తున్నారని, మొదట తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
Updated Date - 2023-01-28T00:16:45+05:30 IST