ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యే అవినీతి భరించలేకే కాంగ్రెస్‌లోకి వలసలు

ABN, First Publish Date - 2023-11-01T23:58:28+05:30

కోదాడ ఎమ్మెల్యే అవినీతి వ్యతిరేకంగా పలువురు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరుతున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

కాంగ్రె్‌సలో చేరుతున్న నాయకులు

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ రూరల్‌, నవంబరు 1: కోదాడ ఎమ్మెల్యే అవినీతి వ్యతిరేకంగా పలువురు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరుతున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొమరబండ, మంగళతండా, తొగర్రాయి గ్రామాల్లో బుధవారం పర్యటించారు. మంగళతండా సర్పంచ్‌ రమావత్‌ పద్మజబ్బార్‌ సుమారు వంద మందితో కలిసి బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు. కోదాడ మండలంలో ఇప్పటికే జెడ్పీటీసీ క్రిష్ణకుమారి, గుడిబండ సర్పంచ్‌ లంకెల అలివేలు మంగమ్మ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అమరనాయిని వెంకటేశ్వరరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ నలజాల శ్రీనివాస్‌ బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరారని తెలిపారు. త్వరలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు పెద్దఎత్తున బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మావతి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ర ంగారావు, ఎర్నేని బాబు, వరప్రసాద్‌రెడ్డి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-01T23:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising