అంగనవాడీ కేంద్రాలను పర్యవేక్షించండి
ABN, First Publish Date - 2023-10-04T23:37:26+05:30
జిల్లాలోని అంగనవాడీ కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జడ్పీ ఐదో స్థాయీ కమిటీ చైర్‌పర్సన చింతారెడ్డి చంద్రకళ అన్నారు.
ఐదో స్థాయీ కమిటీ చైర్‌పర్సన చింతారెడ్డి చంద్రకళ
సూర్యాపేట సిటీ, అక్టోబరు 4 : జిల్లాలోని అంగనవాడీ కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జడ్పీ ఐదో స్థాయీ కమిటీ చైర్‌పర్సన చింతారెడ్డి చంద్రకళ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన ఐదో స్థాయీ కమిటీ(మహిళా, శిశు సంక్షేమం) సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి, మాట్లాడారు. అంగనవాడీ కేంద్రాల పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆహార పదార్థాలు పక్కదారి పట్టుకుండా సూపర్‌వైజర్లు నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో జీ సురేష్, చిలుకూరు జడ్పీటీసీ బొలిశెట్టి శిరీష, అధికారులు, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు జడ్పీ కార్యాలయంలో మూడో, ఆరో స్థాయీ కమిటీ సమావేశాలు
జడ్పీ కార్యాలయంలో గురువారం మూడో స్థాయీ (వ్యవసాయం), ఆరో స్థాయీ(సాంఘిక సంక్షేమం) కమిటీల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈవో సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడోస్థాయీ సంఘం సమావేశం ఉదయం 11 గంటలకు, ఆరోస్థాయీ సంఘ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.
Updated Date - 2023-10-04T23:37:48+05:30 IST