మునిసిపాలిటీల్లో పన్ను వసూళ్లపై నజర్
ABN, First Publish Date - 2023-02-13T00:19:57+05:30
జిల్లాలోని మునిసిపాలిటీలో పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి 31వ తేదీ న నాటికి జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో రూ.30కోట్లు వసూళ్లే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.
జిల్లాలోని మునిసిపాలిటీలో పరిధిలో పన్ను వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి 31వ తేదీ న నాటికి జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో రూ.30కోట్లు వసూళ్లే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. గత ఏడాది సూర్యాపేట మునిసిపాలిటీలో నూరు శాతం దాటి రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేశారు. అయితే మిగతా మునిసిపాలిటీల్లో మాత్రం అంత ఆశాజనకంగా వసూలు కాలేదు. ఈసారి ్న లక్ష్యాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారు లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 55 శాతం మేర వసూళ్లు మాత్రమే జరిగాయి. నిర్ణీత గడువు ముగిసే సమయంలో ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం ఇప్పటికే పన్ను లు చెల్లించని దుకాణాలను సీజ్ చేశారు.
– సూర్యాపేట టౌన్
సూర్యాపేటలో మునిసిపాలిటీ అధికారులు ఇంటి పన్నుల వసూళ్లను ముమ్మరం చేశారు. ఇంటి పన్నులతో పాటు వాణిజ్య సముదాయాలు, సెమీ వాణిజ్య సముదాయాలకు పన్నులు చెల్లించాలని అధికారులు జీపుల్లో తిరుగుతూ పన్నులు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. చివరి నెలలో మాత్రమే గతంలో ఎక్కువగా పన్నులు వసూలు చేసేవారు. అయితే ప్రస్తుతం గతానికి కంటే భిన్నంగా సెప్టెంబరు నెల నుంచే అధికారులు పన్నులను వసూలు చేస్తున్నారు. దీనికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. 19 మంది బిల్ కలెక్టర్లు, ఒక ఆర్‌ఐ, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, మునిసిపల్ సిబ్బంది, జవాన్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పన్నులను వసూలు చేస్తున్నారు. మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆదివారం, ఇతర పండుగల సెలవు రోజుల్లో కూడా పన్నులను వసూలు చేస్తున్నారు.
రెడ్ నోటీసులు అందజేత
పన్నుల బకాయిలు అధికంగా ఉన్న వారికి రెడ్ నోటీసులు అందజే శారు. పట్టణంలోని 150 నుంచి 250 మందికి రెడ్ నోటీసులు అందజేశారు. దాదాపు రూ.50వేల నుంచి రు.లక్ష వరకు పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు మూడు రోజుల్లో పన్నులు చెల్లించకుంటే జప్తు చేసే అధికారం మునిసిపాలిటీకి ఉంటుంది. తమకు ఇంటి పన్ను అధికంగా వచ్చిందని కొందరు మునిసిపల్ రెవెన్యూ విభాగంలో ఫిర్యాదు దరఖాస్తులు అందజేస్తున్నారు. జిల్లాలో సూర్యాపేట మునిసిపాలిటీతో పాటు కోదాడ, హుజూర్‌నగర్ మునిసిపాలిటీలు ఉండగా కొత్తగా నేరేడుచర్ల, తిరుమలగిరిని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సూర్యాపేట మునిసిపాలిటీలో పన్ను వసూళ్లు అంత ఆశాజనకంగా లేదు. అయితే నేరేడుచర్లలో అత్యధికంగా 57శాతం వసూలు చేశారు.
సకాలంలో పన్నులు చెల్లిస్తే అపరాధ రుసుం ఉండదు
పన్నులు చెల్లించకుంటే అపరాధ రుసుంతో అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సెలవు రోజుల్లో కూడా పన్నుల వసూళ్లకు మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రామాంజులరెడ్డి, మునిసిపల్ కమిషనర్, సూర్యాపేట
మునిసిపాలిటీలు అసెసెస్‌మొంట్లు లక్ష్యం(లక్షల్లో) వసూలు శాతం
సూర్యాపేట 33304 1854.09 1010 51.03
కోదాడ 16179 699.27 380.14 48.59
హుజూర్‌నగర్ 7500 266.45 125.57 42.01
నేరేడుచర్ల 3676 108.53 57.87 58.12
తిరుమలగిరి 5348 109.67 79.24 49. 98
టీ సభ్యులు
Updated Date - 2023-02-13T00:19:59+05:30 IST