ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ వెంకట్‌రెడ్డిపై హైకోర్టులో పిటిషన్‌

ABN, First Publish Date - 2023-04-05T00:14:37+05:30

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకో వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

చెరుకు సుధాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దాఖలు చేసిన చెరుకు సుధాకర్‌ పిటిషన్‌

జిల్లా కోర్టు చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు

నల్లగొండ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చర్యలు తీసుకో వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. వెంకట్‌రెడ్డిపై హత్యానేరం నమో దు చేయాలని సుధాకర్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ కొనసాగింది. కొద్ది రోజుల క్రితం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెరుకు సుధాకర్‌ కుమారుడు చెరుకు సుహాస్‌కు ఫోన్‌ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుమార్లు ఎస్పీతో పాటు వన్‌టౌన్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నామమాత్రపు కేసులు నమోదు చేస్తున్నందున వెంకట్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన హైకోర్టు జిల్లా సెషన్‌ కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2023-04-05T00:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising