Suryapet: కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు
ABN, First Publish Date - 2023-08-20T08:22:26+05:30
సూర్యాపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేట పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ ఇతర పార్టీల నేతలను ముందస్తు అరెస్టులు చేశారు.
సూర్యాపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదివారం సూర్యాపేట (Suryapet) పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు కాంగ్రెస్ నాయకులను (Congress Leaders) ముందస్తు అరెస్టులు (Arrest) చేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి (Patel Ramesh Reddy)ని హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. బీజేపీ (BJP) ఇతర పార్టీల నేతలను (Other Party Leaders) ముందస్తు అరెస్టులు చేశారు.
సూర్యాపేట పట్టణానికి సీఎం కేసీఆర్ ఆదివారం రానున్నారు. ఈ మేరకు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాల యం, జిల్లా పోలీస్‌కార్యాలయం, సమీకృత మార్కెట్, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాల అనంతరం సుమారు రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు జనసమీకరణ చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూర్యాపేట నియోజకవర్గ భాధ్యతలు అప్పగించారు. వారంతా వారికి కేటాయించిన మండలాలు, పట్టణంలోని వార్డుల్లో పర్యటిస్తూ బహిరంగ సభ విజయవంతానికి కృషి చేస్తున్నారు. సూర్యాపేట పట్టణమంతా గులాబీమయమైంది. గులాబీ జెండాలు, ప్లెక్సీలతో పట్టణంలోని వీధులన్నీ నిండిపోయాయి. సీఎం పర్యటనకు అడ్డంకిగా వర్షం వస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులు సుమారు 3వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీఎం కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను డీఐజీ చౌహాన్, కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు శనివారం పరిశీలించారు.
Updated Date - 2023-08-20T08:22:26+05:30 IST