వానా కాలం.. వ్యాధుల గాలం
ABN, First Publish Date - 2023-06-28T01:22:42+05:30
వానాకాలం సీజన ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పరిసరాల అపరిశుభ్రత, కలుషిత నీటిని తాగడంతో ప్రజలు జలుబు, జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు.
కనిపించని పారిశుధ్య నిర్వహణ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత
వానాకాలం సీజన ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పరిసరాల అపరిశుభ్రత, కలుషిత నీటిని తాగడంతో ప్రజలు జలుబు, జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ తరుణంలో ప్రజలకు సకాలంలో వైద్యం అందిచాల్సిన ప్రభుత్వ ఆసుప్రత్రుల్లో సిబ్బంది కొరత ఉంది. గతంలో జిల్లాలోని తండాల్లో డయేరియా, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలడంతో ప్రజలు అల్లాడారు. పరిశుభ్ర వాతావరణం లేనందున గ్రామాల్లోని ప్రజలు నిత్యం రోగాల బారిన పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు ప్రారంభమైనందున సహజ సిద్ధం గా సీజనల్ జ్వరాల బాధితులు పెరిగారు.
- సూర్యాపేట టౌన
గతంలో ఆత్మకూర్(ఎస్) మండలం, చివ్వెంల మండలంలోని పలు తండాల్లో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత ఏడాది జిల్లాలో మలేరియా కేసులు ఐదు, డెంగీ నాలుగు, డయేరియా కేసులు 90నమోదయ్యా యి. ఈ కేసుల దృష్ట్యా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కావాల్సిఉంది. జిల్లాలో ఏరియా ఆసుపత్రులు రెండు, కమ్యూనిటీ హెల్త్ సెంటరు ఒకటి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 23, ఆరోగ్య ఉప కేంద్రాలు 172ఉన్నా యి. వీటితో పాటు ఆయుర్వేద ఆసుపత్రులు14, హోమియోపతి ఆసుపత్రులు ఆరు, యూనాని ఆసుపత్రులు మూడు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో 45మంది వైద్యులు పనిచేస్తుండగా 800పడకల సామర్థ్యం ఉంది. సూర్యాపే ట, హుజుర్‌నగర్‌లో 100పడకల ఆసుపత్రి ఉండగా, కోదాడలో 50పడకల ఆసుపత్రి ఉంది. సూర్యాపేట ఏరి యా ఆసుపత్రిలో అధికంగా వైద్యుల కొరత ఉంది. పలు ఆసుపత్రులో వైద్యల కొరతతో రోగులకు తగిన సేవలు అందడం లేదు.
పారిశుధ్య లోపంతో వ్యాధుల విజృంభణ
జిల్లాలోని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ఆవాసాలు, తండాల్లో పారిశుధ్య లోపంతోనే వ్యాధులు విజృంభిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనవాసాల మధ్య చెత్తాచెదారం నిల్వ ఉంటున్నందున దోమ లు, ఈగల ఉధృతి పెరిగింది. వీటితో తాగునీరు కూడా కలుషితమవుతోంది. నీటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్ లు, కిట్లు అందుబాటులో లేనందున ప్రజలు కలుషితమైన నీటిని, ప్లాంట్లలో నాణ్యత లేని నీటిని కొనుగోలు చేసి తాగాల్సి వస్తోంది. సక్రమంగా కోర్లినేషన్ చేయనందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్వచ్చభారత్‌లో భాగంగా జిల్లాలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించిన ప్పటికీ నిర్వహణ లోపాలు ఉన్నాయి. పంచాయతీలకు సరిపడా నిధులను కేటాయించ నందున ఇటువంటి సమస్యలు వచ్చాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే గ్రామాల్లో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది చివ్వెంల మండలంలోని పాండ్యనాయక్ తండా ఆవాసం రాజుతండా, వాల్య తండా, మున్యానాయక్ తండాలో, ఆత్మకూర్(ఎస్) మండలంలోని బొప్పారం, నశీంపేట, ఏపూర్, మక్తాకొత్తగూడెంలో విష జ్వరాలు విజృంభించాయి.
కనిపించని ఫాగింగ్ యంత్రాలు.. నిధుల వృథా
దోమల నియంత్రణ కోసం జిల్లాలో కొనుగోలు చేసిన ఫాగింగ్ యంత్రాలు కని పించడంలేదు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన పలు ఫాగిం గ్ యంత్రాలు పనిచేయడం లేదు. ఉమ్మడి జిల్లాలోని 19మునిసిపాలిటీల్లో ప్రతి సంవ త్సరం ఫాగింగ్ కోసం రూ.80లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దోమలను చంపడానికి ఈ ఫాగింగ్ యంత్రాల్లో మలాథియన ద్రావణం వినియోగించాల్సి ఉండగా, దీనికి బదులుగా కిరోసినని వినియోగిస్తున్నట్లు తెలిసింది. దీంతో యంత్రాలు తరచుగా మరమ్మతుకు గురవుతున్నట్లు సమాచారం. సూర్యాపేటలో స్ర్పేయింగ్ యంత్రాలు 40, ఫాగింగ్ యంత్రాలు ఐదు ఉన్నా యి. అదేవిధంగా కోదాడలో స్ర్పేయింగ్ యంత్రాలు నాలుగు, ఫాగింగ్ యంత్రాలు మూడు ఉన్నాయి. తిరుమలగిరిలో స్ర్పేయింగ్ పరికరం ఒకటి, ఫాగింగ్ యంత్రం ఒకటి, హుజూర్‌నగర్‌లో స్ర్పేయింగ్ యంత్రం ఒకటి, ఫాగింగ్ యంత్రాలు రెండు, నేరేడుచర్లలో స్ర్పేయింగ్ యంత్రాలు మూడు, ఫాగింగ్ యంత్రాలు రెండు ఉన్నాయి. ముందస్తు చర్యలు తీసుకుంటాం
సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఏ గ్రామాల్లో వ్యాధుల ప్రభలే అవకాశం ఉందో అక్కడికి వైద్యసిబ్బంది ప్రత్యేక వాహనంలో వెళ్లి ప్రజలకు వైద్యసేవలు అందించే విధంగా చర్యలు తీసుకు న్నాం.ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు,సెలైన్లు, ఎమర్జెన్సీ మందులు అం దుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- కోటాచలం, డీఎంహెచ్‌వో, సూర్యాపేట
యి.
Updated Date - 2023-06-28T01:22:42+05:30 IST