ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ పెద్దపీట

ABN, First Publish Date - 2023-04-20T00:56:14+05:30

బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ పెద్ద పీట వేసిందని ఆపార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సైదేశ్వరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ టౌన్‌, ఏప్రిల్‌ 19: బడుగు, బలహీన వర్గాలకు టీడీపీ పెద్ద పీట వేసిందని ఆపార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరావు అన్నారు. బుధవారం కోదాడలోని ఆయన ఇంటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని అన్నారు. దేశంలోనే హైదరాబాద్‌ను అత్యుత్తమ నగరంగా చంద్రబాబునాయుడు తీర్చిద్దారన్నారు. దీంతో నగరంలో ఎంతోమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 105మంది బడుగు, బలహీన వర్గాలు, దళితులను నాయకులుగా టీడీపీ తీర్చిదిద్దిందన్నారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష టీడీపీతోనే నెరవేరనుందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలను గురువారం నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో ఉప్పగండ్ల సరోజశ్రీనివాసరావు, కొండ సోమయ్య, చాపల శ్రీని వాసరావు, ఉన్నం హనుమంతరావు, కొల్లు సత్యనారాయణ, సహదేవ్‌, గుండు వీరబాబు, షేక్‌ మస్తాన్‌, నాగరాజు, రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-20T00:56:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising