ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శ మహిళా కవయిత్రి మొల్ల

ABN, First Publish Date - 2023-03-13T23:39:37+05:30

కవయిత్రి మొల్ల గొప్ప ఆదర్శ మహిళ అని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం సంస్థాననారాయణపురం మండలకేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కవయిత్రి మొల్ల రాతి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

సంస్థాననారాయణపురంలో మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సంస్థాననారాయణపురం / భువనగిరి రూరల్‌ / భువనగిరి టౌన / బొమ్మలరామారం, మార్చి 13 : కవయిత్రి మొల్ల గొప్ప ఆదర్శ మహిళ అని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం సంస్థాననారాయణపురం మండలకేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కవయిత్రి మొల్ల రాతి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కుమ్మర్ల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. కుమ్మరులు ఐక్యంగా ఉండి రాజకీయంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవిప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతివెంకటేశంగౌడ్‌, సర్పంచలు శికిలమెట్ల శ్రీహరి, కుమ్మరి సంఘం అధ్యక్షుడు చిలువేరు అంజయ్య, రాష్ట్ర నాయకులు చిలివేరు సంజీవ, నడికుడి జయంత రావు, రాచకొండ కృష్ణయ్య, సింగిల్‌ విండో చైర్మన జక్కిడి జంగారెడ్డి, కత్తుల లక్ష్మయ్య, సిలివేరి వీరేశం, చిలువేరు అంజయ్య, చిలువేరు సురేష్‌, తెలంగాణ బిక్షం, రత్తిపల్లి యాదయ్య. చిలువేరు నరసింహ పాల్గొన్నారు.

భువనగిరి మండలం తాజ్‌పూర్‌లో మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ర్యాకల శ్రీనివాస్‌, సర్పంచ బొమ్మారపు సురేష్‌, ఉపసర్పంచ ర్యాకల సంతోష శ్రీనివాస్‌, సందీప్‌, రామస్వామి, మమత, సారిక, వెంకటేష్‌, ప్రవీణ్‌, బాల్‌రాజ్‌, నర్సింహ తదితరులు ఉన్నారు.

భువనగిరి పట్టణంలో భువనగిరి కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొల్ల కవితలు, రచనలను నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తాడూరి చంద్రయ్య, చిన్నగారి అంజయ్య, తాడూరి కిష్టయ్య, మల్లేష్‌, నర్సింహ, భిక్షపతి, అంజయ్య, గణేష్‌, కృష్ణ, నర్సింహ, బలరాం తదితరులు పాల్గొన్నారు.

బొమ్మలరామారం మండలకేంద్రంలో మొల్ల జయంతి వేడుకల్లో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన జి.బాలనర్సయ్య మాట్లాడుతూ రామాయణాన్ని ఐదు రోజుల్లో తెలుగులోకి అనువంధించిన మహా ప్రజ్ఞాశాలి అని అన్నారు. కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షుడు బోనకూర మల్లేష్‌ ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమంలో శాలివాహన సంఘం పట్టణ అధ్యక్షుడు బేతాళ లక్ష్మయ్య, ఉపసర్పంచ జూపల్లి భరత, గుర్రాల లక్ష్మారెడ్డి, రామకృష్ణ, కట్ట శ్రీకాంత, శ్రీనివాసులు, పాండు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-13T23:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising