ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయ అవార్డు
ABN, First Publish Date - 2023-11-10T05:03:12+05:30
సీఐడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫింగర్ ప్రింట్ బ్యూరో జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకుంది.
అభినందించిన డీజీపీ అంజనీ కుమార్
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : సీఐడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫింగర్ ప్రింట్ బ్యూరో జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకుంది. న్యూ ఢిల్లీలో ఎన్‌సీఆర్‌బీ ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన 24వ జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌లో తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ విభాగం 2వ బహుమతి సొంతం చేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీ్‌సస్టేషన్‌లో 2020లో నమోదైన కేసులో అత్యాధునిక ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఉపయోగించి నిందితుల్ని పట్టుకోవడంతోపాటు శిక్ష పడేలా చేశారు. ఆ కేసులో నిందితులు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా ఫింగర్ ప్రింట్స్ విభాగం అధికారులు ఘటనా స్థలంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా వాటిని విశ్లేషించి అసలు నిందితుల్ని గుర్తించి పట్టుకున్నారు. ఈ కేసులో ఉపయోగించిన టెక్నాలజీకి తెలంగాణ ఫింగర్‌ప్రింట్ విభాగానికి అవార్డు లభించింది. అవార్డు సాధించిన ఫింగర్ ప్రింట్ విభాగం అధికారులు, సిబ్బందిని డీజీపీ అంజనీ కుమార్, సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ గురువారం పోలీసు ప్రధాన కార్యాలయంలో అభినందించారు.
Updated Date - 2023-11-10T05:03:13+05:30 IST